హాయ్ ఐ యామ్ చిట్టి. ద రోబోట్... అంటూ రోబో సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఇప్పుడు అంతకు పదింతల మెస్మరైజ్ చేసేందుకు డైరెక్టర్ శంకర్ రజనీతో కలిసి 2.0 సినిమా మొదలుపెట్టాడు. ఈ సినిమా షూటింగ్ సుదీర్ఘంగా సాగుతోంది. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడంటే ఇదిగో.. అదిగో అంటున్నారే కానీ కనీసం టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేదు.
రూ. 400 కోట్ల వ్యయంతో 2.0 సినిమా తీస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. కానీ ఇందులో గ్రాఫిక్స్ చాలా కీలకం కావడంతో షూటింగ్ అనుకున్న దానికన్నా లేటవుతోంది. దీంతో డీలాపడ్డ అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు ఇప్పుడు 2.0 టీజర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఐపీఎల్ ప్రస్తుత సీజన్ ముగిసే 27వ తేదీన టీజర్ రిలీజ్ చేయడానికి 2.0 ఫిలిం మేకర్లు కుస్తీలు పడుతున్నారనేది కోలీవుడ్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.
అనుకున్న ప్లానింగ్ వర్కవుట్ అయితే ఐపీఎల్ చివరి మ్యాచ్ అయిపోయిన వెంటనే చిట్టి మెరుపులు మెరిసే అవకాశం ఉంది. 2.0 మూవీ తెలుగు - తమిళం - హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇందులో విలన్ గా నటించాడు. అసలు 2.0 టీజర్ ఎప్పుడో రావాల్సి ఉంది. ఈసారయినా రిలీజ్ చేయగలిగితే అభిమానుల్లో కాస్తంత ఉత్సాహం పెల్లుబికే అవకాశం ఉంది.