'కిక్కు' కోసం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ తీశాడట

Update: 2019-06-15 14:30 GMT
ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సమయంలో రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్రం ఏ స్థాయిలో వివాదాస్పదం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పుడు ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడును వర్మ విలన్‌ గా చూపించాడు. ఎన్టీఆర్‌ ను వెన్ను పోటు ఇష్యూను వర్మ చూపించే క్రమంలో చంద్రబాబు నాయుడును చాలా కన్నింగ్‌ గా విలన్‌ గా వర్మ చూపించడం జరిగింది. దాంతో ఆ సినిమాను ఏపీలో విడుదల కాకుండా బాబు అడ్డుకున్నాడు.

బాబు ఓటమికి సవాలక్ష కారణాలుంటే అందులో వర్మ తీసిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ కూడా ఒక కారణం అనే వారు లేకపోలేదు. అలాంటి సంచలన సినిమాను నిర్మించిన నిర్మాత రాకేష్‌ రెడ్డి తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. వ్యాపారాలు చేసి బాగానే సంపాదించిన తనకు సినిమాలు అంటే ఎప్పటి నుండో ఆసక్తి. ఆ ఆసక్తితో నిర్మాతగా మారాను. అయితే మొదటి సినిమాతోనే సెన్షేషన్‌ క్రియేట్‌ చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్‌ వెన్ను పోటు ఇష్యూను తీసుకున్నాను.

ఆ పాయింట్‌ తో చాలా మంది దర్శకులను సంప్రదించాను. చివరకు వర్మ వంటి సెన్షేషనల్‌ దర్శకుడు లభించాడు. ఇలాంటి సినిమా నిర్మిస్తే కిక్కు వస్తుందని.. ఎప్పటికి గుర్తుండే సినిమా అవుతుందని.. డబ్బులు వచ్చినా రాకున్నా కూడా ఈ సినిమాతో వచ్చే కిక్‌ ఎప్పటికి  గుర్తిండి పోతుందని భావించాను. అందుకే ఈ చిత్రం నిర్మాణం చేపట్టానని రాకేష్‌ రెడ్డి అన్నారు.

వైకాపాకు చెందిన తాను ఎన్టీఆర్‌ సినిమాను నిర్మించడం అంటే అందరు సహజంగానే తమ సినిమా వైపు చూస్తారు. ఆ విషయం కూడా తనకు కలిసి వచ్చిందని రాకేష్‌ రెడ్డి అన్నాడు. నిర్మాతకు చాలా రెస్పెక్ట్‌ ఇచ్చే దర్శకుడు వర్మ. ఆయన నిర్మాతలకు అనుగుణంగా సినిమాను తీస్తాడంటూ దర్శకుడు వర్మపై నిర్మాత రాకేష్‌ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించాడు.

Tags:    

Similar News