డ్రెస్సుకే అందాన్నిచ్చిన రకుల్

Update: 2017-09-16 07:07 GMT
సౌత్ లో బాహుబలి తర్వాత అందరి ద్రుష్టి ఇప్పుడు స్పైడర్ పై మళ్లింది. ఇన్నేళ్ల మహేష్ కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రం విడుదల అవుతోంది. తమిళ్ లో కూడా ఈ సినిమా తెరకెక్కడంతో సినిమా కోసం కోలీవుడ్ ప్రేక్షకులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. మురగదాస్ కెరీర్ లో కూడా ఈ సినిమా చాలా పెద్దదే అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇంతకుముందు తీసిన సినిమాలకన్నా ఈ సినిమా కోసం ఎక్కువ కష్టపడ్డారు.

ఒక తెలుగు హీరోతో ఈ స్థాయిలో సినిమాను తీశారు అంటే అర్ధం చేసుకోవచ్చు మహేష్ స్టార్ స్టామినా పై ఆయన ఏ రేంజ్ లో నమ్మకం పెట్టుకున్నారో. ఇక ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ కి చిత్ర నటీనటులకు ఒక సవాల్ లాంటిదే అని చెప్పాలి. ప్రతి విషయంలో అందరు జాగ్రత్త పడ్డారు. ముఖ్యంగా హీరోయిన్ రకుల్ అయితే సినిమా కోసం చాలా కష్టపడిందని దర్శకుడు -హీరో రీసెంట్ గా జరిగిన ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పారు. షూటింగ్ కి అవసరమైనప్పుడల్లా డేట్స్ ఇచ్చిందని కూడా చెప్పారు.

అయితే అమ్మడు ఫ్రీ రిలీజ్ వేడుకలో ఫెమస్ గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన డ్రెస్ లో కనిపించి అందరినీ ఆకర్షించింది. ఈ డ్రెస్ నార్త్ లో చాలా ఫేమస్ ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్ - నేషనల్ మోడల్స్ స్పెషల్ గా డిజైన్ చేయించుకుంటారు. ప్రస్తుత రోజుల్లో ఆ స్టైల్ వేస్తే ఎలాంటి వారైనా అందంగా ఉంటారు. కానీ నిన్న రకుల్ ని ఆ డ్రెస్ లో చూస్తుంటే డ్రెస్సుకే అందమొచ్చిందని అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. స్పైడర్ సినిమాలో రకుల్ పాత్ర పై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ట్రైలర్ లో కిస్ కిస్ అనే డైలాగ్ తో అందర్నీ ఆకర్షించింది. మరి ఈ సినిమాలో ఎలా ఉండబోతోందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే!! 
Tags:    

Similar News