మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీని.. మొదటిరోజునే డిజాస్టర్ గా లెక్క కట్టిన సంగతి తెలిసిందే. బయ్యర్లకు భారీ నష్టాలు తప్పవని, తిరుగుబాటు చేస్తారని, నెక్ట్స్ ప్రాజెక్ట్ లో వాటా అడుగుతారని ఇలా బాగానే రూమర్స్ వినిపించాయి. ఈ నెగిటివ్ టాక్ దెబ్బకు.. కనీస మాత్రం కూడా పబ్లిసిటీ చేయలేదు బ్రూస్ లీ యూనిట్. అడపాదడపా ముందే ఇచ్చిన ఇంటర్వ్యూ లు మాత్రం టీవీల్లో ప్రసారమయ్యాయి. ఇంత ఘోరమైన టాక్ వచ్చాక.. కలెక్షన్స్ పైచాలామంది బెంగపెట్టుకున్నారు. ఎన్ని కోట్లు పోతాయోనని భయపడ్డారు.
అయితే.. బ్రూస్ లీ మాత్రం దర్జాగా 40 కోట్ల క్లబ్ లోకి ఎంటరయిపోయాడు. ప్రస్తుతానికి ఈ మూవీ కలెక్షన్లు 41 కోట్ల 'షేర్' మార్కును దాటాయి. అంటే ఇంతమొత్తం వసూలు చేసి డిజాష్టర్ కు బ్రూస్ లీ కొత్త భాష్యం చెప్పాడన్నమాట. ఇకపై అట్టర్ ఫ్లాప్ అని ఏ సినిమానైనా అనాలంటే.. అది 41 కోట్లు వసూలు చేయాలి అని కూడా అంటున్నారు. ఇది స్టార్ హీరోలకి మాత్రమే పెడుతున్న కండిషన్ లెండి. ఎందుకంటే.. ఈ మొత్తం వస్తే హిట్, బ్లాక్ బస్టర్ అన్న లెక్కలు మనదగ్గర బాగానే ఉన్నాయి. రీసెంటుగా మహేష్ బాబు కూడా అట్టర్ ఫ్లాప్ అన్న 'ఆగడు'తో 40 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టాడు. సో.. ఈసారి నుండి పెద్ద హీరో సినిమా డిజాష్టర్ అంటే.. 40 క్రోర్స్ కంపల్సరీ.
కాకపోతే ఒక్క విషయం చెప్పుకోవచ్చు.. ఇన్వెస్టుమెంట్ తో సంబంధం లేకుండా.. ఫ్లాప్ సినిమాలు తీసి కూడా 40కోట్ల క్లబ్ లో చేరగల హీరోలుగా మహేష్ అండ్ చరణ్ లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు కదూ.