బాహుబలి వంటి బిగ్గెస్ట్ సక్సెస్ మూవీని తెరకెక్కించిన రాజమౌళి దర్శకత్వంలో సినిమా అనగానే అంచనాలు తారా స్థాయిలో ఉండటం చాలా కామన్. అలాంటిది జక్కన్న దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటిస్తే ఆ సినిమా స్థాయి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆకాశంలో అంచనాలుండే ఆ సినిమాకు కథ ఎలా ఉండాలి. తన ప్రతి సినిమాకు అద్బుతమైన స్టోరీ లైన్ ను తీసుకునే జక్కన్న ఈసారి కూడా తన తండ్రితో కలిసి ఒక విభిన్నమైన, వినూత్నమైన కథను ఆర్ మల్టీ స్టారర్ కోసం సిద్దం చేశాడట. అదే విషయాన్ని చరణ్ చెప్పుకొచ్చాడు.
చరణ్ తాజాగా ‘వినయ విధేయ రామ’ చిత్రం ప్రమోషన్ సందర్బంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు, తారక్ కు కలిపి ఒకే సారి రాజమౌళి కథ చెప్పాడు. రాజమౌళి కథ చెప్పిన తర్వాత, అంతా సైలెన్స్, నేనైతే షాక్ లో ఉండిపోయి, నోటి నుండి మాట రాలేదు. అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయనిపించింది. ఏమాట్లాడాలో అర్థం కాక, ఆశ్చర్యంతో అలాగే ఉన్నా, మొదట తారక్ స్పందించాడు. అయితే నాకు మాత్రం తేరుకోవడానికి కాస్త సమయం పట్టింది. అంతటి అద్బుతమైన కథతో ఈ చిత్రం తెరకెక్కుతుందంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.
మంచి కథతో పాటు రాజమౌళి దర్శకత్వంలో అన్ని కూడా హైలైట్ గా ఉంటాయి. ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లుగా ఉంటుందని చరణ్ మాటలతో అనిపిస్తోంది. మమ్ములను ఎంపిక చేసుకున్న తర్వాత కథను తయారు చేయలేదు. కథను సిద్దం చేసుకున్న తర్వాత, ఆ కథలోని పాత్రలకు మేము సూట్ అవుతామనిపించిన తర్వాతే రాజమౌళి మమ్ములను ఎంపిక చేసుకున్నాడు. హీరోను బట్టి కథను రాసుకునే వ్యక్తి రాజమౌళి కాదని చరణ్ చెప్పుకొచ్చాడు.
ఇక ఎన్టీఆర్ మరియు మహేష్ బాబులతో తన స్నేహం గురించి రామ్ చరణ్ స్పందిస్తూ.. మా స్నేహం ఇప్పటిది కాదు. ఈమద్య కాలంలో సోషల్ మీడియా ఎక్కువ అవ్వడం వల్ల మా స్నేహం ఈమద్య మెదలైందని కొందరు భావిస్తున్నారు. కాని మా స్నేహం చాలా సంవత్సరాల క్రితం నుండే ఉందని చరణ్ అన్నాడు. అంతకు ముందు కూడా మేము తరచు కలుసుకునేవాళ్లం, అయితే మహేష్ తో మాత్రం ఈమద్య ఎక్కువ కలుస్తున్నానని చరణ్ చెప్పుకొచ్చాడు.
Full View