టాలీవుడ్ లోని క్యూటెస్ట్ కపుల్స్ లో మెగా కపుల్ రామ్ చరణ్ - ఉపాసన ఒకరు. వీరిద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చెర్రీకి సంబంధించిన కొన్ని విషయాల్లో ఉపాసన చాలా స్పెషల్ కేర్ తీసుకుంటుందని టాక్. మిస్టర్ సీ...మిస్టర్ పర్ ఫెక్ట్ గా ఉండాలని ఉపాసన కోరికట. అయితే, తాజాగా ఓ స్పీచ్ విషయంలో ఉపాసన తనకు హెల్స్ చేసిందని చెర్నీ స్వయంగా రివీల్ చేశాడు. తాను ఇప్పటివరకు చాలా స్పీచ్ లు చెప్పానని...కానీ, ఆ స్పీచ్ లో అసలు తప్పులు పోకూడదనే ఉద్దేశంతో పేపర్ పై రాసుకు వచ్చానని...ఆ స్పీచ్ ప్రిపేర్ చేయడంలో ఉపాసన కూడా హెల్ప్ చేసిందని చెర్రీ అన్నాడు. ఉపాసన గురించి మిస్టర్ సీ చెప్పిన ఆసక్తికర విషయం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నిన్న హైదరాబాద్ లోని చిరెక్ స్కూల్ లో జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకలకు చెర్రీ స్పెషల్ గెస్ట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. తాను చదివిన స్కూల్ లో ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం సంతోషంగా ఉందని చెర్రీ అన్నాడు. అక్కడ ప్రసంగించిన సందర్భంగా ఉపాసన గురించి చెర్రీ మాట్లాడాడు. తన 11 ఏళ్ల సినీ కెరీర్ లో చాలా ఫంక్షన్లు, ఈవెంట్లలో స్పీచ్ లు ఇచ్చానని, ఎక్కడా పేపర్ మీద రాసుకొని వెళ్లలేదని అన్నాడు. అయితే, చదువుకున్న స్కూల్ లో స్పీచ్ ఇచ్చేటపుడు....తప్పులు పోతే బాగోదని అన్నాడు. అందులోనూ ఆ స్కూల్ ఫౌండర్, డైరెక్టర్ పక్కన ఉన్నపుడు అసలు పొల్లు పోకూడదని అన్నాడు. ఒకవేళ తప్పులు పోయినా....నవ్వకూడదంటూ చమత్కరించాడు. ఈ స్పీచ్ ఉపాసన ప్రిపేర్ చేసి తనకు హెల్ప్ చేసిందని చెర్రీ చెప్పాడు. మొదటి సారి పేపర్ పై ఉపాసన రాసిచ్చిన స్పీచ్ చదువుతున్నానని చెప్పాడు. తనలాగే తన పిల్లలను కూడా ఇదే స్కూల్ లో చదివిస్తానని చెర్రీ అన్నాడు.