దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ RRR కోసం రామ్ చరణ్ - ఎన్టీఆర్ స్నేహితులు భారీ సాహసాలు చేసిన సంగతి తెలిసిందే. నాలుగున్నరేళ్ల పాటు జక్కన్నకే లాక్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఈ చిత్రంలో తాను మూడు విభిన్నమైన లుక్స్ లో కనిపిస్తానని వెల్లడించారు. ఆర్.ఆర్.ఆర్ లో కథ ప్రకారం నాకు మూడు విభిన్న పాత్రలు .. మూడు విభిన్నమైన లుక్ లు ఉన్నాయి. పాత్ర చిత్రణలో మూడు పాత్రలు విభిన్నంగా ఉంటాయి.. అని రామ్ చరణ్ అన్నారు.
RRR లో రామ్ చరణ్ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామ రాజు అనే కాల్పనిక పాత్రను పోషిస్తున్నారు. రాజమౌళితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని రామ్ చరణ్ అన్నారు. ఇకపోతే ఆర్.ఆర్.ఆర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ముస్లిమ్ యువకుడిగా గిరిజనుడిగా అతడి రూపాల్లో వైవిధ్యం ఇప్పటికే టీజర్లో వెల్లడైంది. తారక్ తదుపరి కొరటాల తో సినిమా కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
చరణ్ ఇతర ప్రాజెక్టుల వివరాల్లోకి వెళితే.. ఆచార్య లో చరణ్ 40నిమిషాల పాత్రలో మెరిపించనున్నారు. శంకర్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని భారీ కాన్వాస్ తో కూడిన చిత్రమిదని తెలిపారు. ఇది సోషియో పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే కథతో తెరకెక్కింది. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్ తదుపరి భారతీయుడు 2 చిత్రీకరణ పూర్తి చేసాక ఆర్.సి 15ని పూర్తి చేయాల్సి ఉంటుంది