కన్నడ క్రేజీ డైరెక్టర్ తో చేతులు కలపనున్న రామ్ చరణ్..?

Update: 2022-09-10 08:22 GMT
RRR వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC15 సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని తర్వాత చెర్రీ ఏ డైరెక్టర్ తో జట్టు కడతాడనే విషయంలో క్లారిటీ రావడం లేదు.

నిజానికి RC15 తర్వాత యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ మూవీ చేయనున్నట్లు గతేడాది అక్టోబర్ లోనే చెర్రీ ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు. అయితే ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టినట్లుగా గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు RC16 కోసం యూవీ టీమ్ వేరే డైరెక్టర్ ను సెట్ చేసే పనిలో ఉందని టాక్ నడుస్తోంది.

డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం 'ఇండియన్ 2' మరియు RC15 చిత్రాలను సమాంతరంగా పూర్తి చేసున్న సంగతి తెలిసిందే. దీంతో చరణ్ కు బిజీ షెడ్యూల్స్ నుండి కాస్త విరామం దొరికింది. ఈ బ్రేక్ లో మెగా పవర్ స్టార్ కొత్త ప్రాజెక్ట్స్ సెట్ చేసుకోవడం పై దృష్టి పెట్టానున్నాడని తెలుస్తోంది.

ఇటీవల కాలంలో టాలీవుడ్ డైరెక్టర్స్ తో పాటుగా ఇద్దరు ముగ్గురు తమిళ కన్నడ దర్శకులు రామ్ చరణ్ కు కథలు వినిపించినట్లు టాక్. అందులో కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తో పాటుగా కన్నడ టాలెంటెడ్ డైరెక్టర్ నర్తన్ కూడా ఉన్నట్లు ప్రముఖంగా వినిపిస్తోంది.

ప్రశాంత్ నీల్ తర్వాత ప్రస్తుతం కన్నడలో క్రేజీ డైరెక్టర్ ఎవరంటే.. అది నర్తన్‌ అనే చెప్పాలి. శివ రాజ్‌ కుమార్‌ తో 'మఫ్టీ' సినిమా చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా శింబు హీరోగా తమిళంలో రీమేక్ చేయబడుతోంది. అయితే నర్తన్ ఇప్పుడు రామ్ చరణ్ తో జతకట్టనున్నాడని అంటున్నారు.

ఇంకా ఏమీ కన్ఫర్మ్ కానప్పటికీ, నివేదికల ప్రకారం రాబోయే రోజుల్లో చరణ్ - నర్తన్ కాంబో సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రూమర్స్ వస్తున్నాయి. అలానే లోకేష్ కనగరాజ్ మరియు సుకుమార్ వంటి దర్శకులతో చెర్రీ సినిమాలు చేయనున్నాడని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కొత్తగా 'వకీల్ సాబ్' ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తారని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో.. యూవీ క్రియేషన్స్ వారు ఇప్పుడు వేణు శ్రీరామ్ ని లైన్ లోకి తీసుకొచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీనిపై మేకర్స్ స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News