నీది అనుకుని చేసే ఏ పనిలో అలుపుండదు, వెనక్కి తిరిగే ఆలోచనవుండదు. నువ్వు అనుకున్న మాటే నీ జీవితంలో ధర్మశాసనం.. ఎవ్వరేం చెప్పినా వినకు, నిజమో అబద్ధమో నీ మనసు మాటే విను.. ఎందుకంటే ఎవరో ముక్కూ మొహం తెలియనివారి చేతిలోకంటే నీ మనసు చేతిలో మోసపోవడం ఉత్తమం.. ఈ వాక్యాలన్నీ ఉపోద్ఘాతాలుగా, భగవంతుని ప్రవచనాలుగా, రచించడానికి సులువుగా, ఆచరించడానికి అత్యంత కష్టంగా వుంటాయి. అయితే వీటిని నూటికి నూటొక్క శాతం పాటించేది రామ్ గోపాల్ వర్మ.
వర్మ గతం గురించి, ప్రస్తుతం గురించి ప్రస్తుతం చర్చించాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ వార్తల్లో వుండే వర్మ గురించి ఇప్పుడు కొత్తగా తెలుసుకోవలసిన అవసరం లేదు. శివ గొప్పదనాలు - ఐస్ క్రీమ్ విమర్శలు వర్మ తలకెక్కవు. అయితే వర్మలో మనం అనుచరించలేని, ఆశ్చర్యపోయే రెబల్ దాగున్నాడు. అందరూ వర్మలానే బ్రతకాలని అనుకుంటారు కానీ వర్మలా బ్రతకడం వర్మకే సాధ్యం.
తత్వవేత్త - తర్క జ్ఞానిగా ఎందరి చేతో మన్ననలను అందుకున్న వర్మ అప్పుడెలా వున్నా, ఇప్పుడింకెలా వున్నా ఎందరికి నచ్చినా, ఎవ్వరిని నొప్పించినా తన జీవితంలో ప్రతీనిత్యాన్ని అతను ఎంజాయ్ చేస్తున్నంతకాలం విజయం సాధిస్తూనే వుంటాడు. ఎందరో ఆశావాదులకు ఆదర్శంగా నిలుస్తూనే వుంటాడు. లాంగ్ లివ్ లెజెండ్.. హ్యాపీ బర్త్ డే రామూ..