ఎనర్జిటిక్ హీరో రామ్ ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు 13 ఏళ్ళయింది.. 16 సినిమాలలో నటించాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఫ్రెండ్స్ స్కూల్స్ కి కాలేజీలకు వెళ్తున్న సమయంలోనే ఇండస్ట్రీ కి వచ్చానని చెప్పాడు. డాక్టర్ కావాలనుకుంటే ఎంబీబీఎస్ చదవాలి. ఇంజినీర్ కావాలనుకుంటే బీటెక్ చదవాలి.. మరి యాక్టర్ కావాలనుకుంటే ఇండస్ట్రీకి రావాలి కదా అనుకున్నాను అలా వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒక షూటింగ్ లొకేషన్ లో అబ్బాయిలకు ఎందుకు హెయిర్ డ్రెస్సర్ లు ఉండరని అడిగితే అందరూ నవ్వారట. కానీ ఆ తర్వాత రెండేళ్లకే ట్రెండ్ మారిందని హీరోలకు హెయిర్ డ్రెస్సర్లు ఎక్కువయ్యారని చెప్పాడు.
ఈమధ్య కాలంలో బాగా నచ్చిన సినిమా గురించి చెప్పమంటే 'రంగస్థలం' అన్నాడు. తనకు సుకుమార్ మీద నమ్మకం చాలా ఎక్కువని సుక్కు చాలా ఇంటెలిజెంట్ అని చెప్పాడు. 'జగడం' సినిమా చేసినప్పటినుండి తనకు 'ఎప్పుడో తెలీదు గానీ నువ్వు మాత్రం ఇండస్ట్రీ హిట్ ఇస్తావు' అని చాలా సార్లు చెప్పాడట. 'రంగస్థలం' ట్రైలర్ రిలీజ్ తర్వాత సుక్కుకు ఆ ఇండస్ట్రీ హిట్ ఇదే అయ్యేలా ఉంది అని మెసేజ్ పెట్టాడట.
ఇక ఇంట్లో అక్కలు వదినలు తనను 'నీ మీద గాసిప్స్ రావడం లేదేంటి' టీజ్ చేస్తుంటారని చెప్పాడు. లాస్ట్ ఇయర్ రకుల్ ప్రీత్ సింగ్ తో ఎంగేజ్ మెంట్ అని వార్తలు వచ్చాయి మరి దాని సంగతేంటి అని అడిగితే "మేమిద్దరం కలిసి 'పండగ చేస్కో' సినిమా చేశాం. మేమంత క్లోజ్ కూడా కాదు. మరి అలాంటి గాసిప్స్ ఎందుకు వస్తాయి అర్థం కాదు" అన్నాడు. అలాంటి గాసిప్స్ ను పట్టించుకోనని చెప్పాడు.
హిందీ డబ్బింగ్ సినిమాలకు పాపులారిటీ పెరిగిన తర్వాత ఎక్కడికి పోవాలన్నా కష్టంగా ఉందట. ఒకసారి ముంబై ఎయిర్ పోర్ట్ లో ఒక వ్యక్తి 'రామ్ భాయ్' అంటూ కేక పెట్టాడట..నేనెలా తెలుసు అని అడిగితే 'మహావీర్ నం.1' తనకు బాగా నచ్చిందని చెప్పాడట. ఇంతకీ అదేంటనుకున్నారు? 'ఒంగోలు గిత్త'! ఫ్యాన్స్ సంగతి ఇలా ఉంటే.. 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాకోసం నెలరోజుల పాటు గిటార్ నేర్చుకున్నానని.. ఒక సినిమా కోసం తను చేసిన పని అదొక్కటే అని చెప్పాడు.