చెర్రీ జెండావంద‌నంలో త‌ప్పు దొర్లిందా?

Update: 2021-08-15 08:30 GMT
దేశంలో 75వ స్వాతంత్య్ర‌ దినోత్స‌వ వేడుక‌లు దేశవ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్న సంగ‌తి  తెలిసిందే. త్రివ‌ర్ణ ప‌తాకాన్ని గాల్లోకి రెప‌రెప‌లాడిస్తూ దేశంపై ఉన్న భ‌క్తిని ప్ర‌జ‌లంతా చాటుకుంటున్నారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ దేశ ప్ర‌జా ప్ర‌తినిధులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఇత‌ర ప్ర‌జానీకం వేడుక‌ల్లో బిజీ అయ్యారు. అయితే  జెండావంద‌నం వేడుక‌ల్లో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ చుట్టూ వివాదం ముసురుకుంది.

చ‌ర‌ణ్ తెలిసో తెలియ‌కో జాతీయ జెండాను అవ‌మానించారంటూ సోష‌ల్ మీడియాలో కొన్ని కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి. కానీ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ అందులో అత‌ని త‌ప్పేముంది? అంటూ వాదిస్తున్నారు. ఈ వివాదంలో ఏది నిజం? ఎవ‌రు అబ‌ద్ధం? అన్న‌ది  తేలేదెలా..!

చ‌ర‌ణ్ ప్ర‌ముఖ‌ మొబైల్ బ్రాండ్ కి  ప్ర‌మోట‌ర్ గా కొన‌సాగుతున్న‌ సంగ‌తి తెలిసిందే. స్వాతంత్య్ర‌ దినోత్స‌వం సంద‌ర్భంగా స‌ద‌రు మొబైల్స్ సంస్థ కొన్ని పత్రిక‌ల‌కు ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చింది. ఈ యాడ్ లో చ‌ర‌ణ్ తెలుపు వ‌ర్ణం బ‌ట్ట‌లు ధ‌రించి జాతీయ జెండాను ఎగ‌ర‌వేస్తున్నారు. అయితే పేప‌ర్ లో ఉన్న ఒక యాడ్ లో జాతీయ జెండా మ‌ధ్య‌లో ఆశోక చ‌క్రం క‌నిపించ‌లేదు. దీంతో చ‌ర‌ణ్ జెండాను అవ‌మానించేలా చేసార‌ని... జెండాను చ‌క్రం మూసేసి ప‌ట్టుకున్నార‌ని .. ఇది జాతీయ జెండాని అవ‌మానించిన‌ట్లేన‌ని కొంత మంది  కామెంట్లు పెట్టారు. అయితే ఇది చ‌ర‌ణ్ కావాల‌ని చేసింది కాద‌ని...సాంకేతికంగా ఆ త‌ప్పుజ‌రిగి ఉండొచ్చ‌ని ఆయ‌న అభిమానులు స‌ర్ధి చెబుతున్నారు.

వాస్త‌వానికి జెండా చ‌ట్ట ప్ర‌కారం అశోక చ‌క్రం లేకుండా జెండా రూపొందించ‌డ‌మే పెద్ద నేరం. దీనిపై స‌ద‌రు కంపెనీ స్పందించింది. ఇలా ప్ర‌క‌ట‌న ఇచ్చేట‌ప్పుడు జాతీయ జెండాను పొలి ఉండేలా త్రివ‌ర్ణ ప‌తాక‌న్ని మాత్ర‌మే వాడుకోవ‌చ్చ‌ని.. చ‌క్రం లేదు కాబ‌ట్టి జాతీయ జెండా కాదు అని.. జాతీయ జెండాలా అనిపిస్తుంది కాబ‌ట్టి అలా వాడుకుమ‌న్నామ‌ని వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. ఇదేమి నేరం ..అవ‌మానం కాద‌ని ఆ సంస్థ  ఖండించింది. అయితే ఇలాంటి విష‌యాల్లో హీరోలు కూడా జాగ్ర‌త్త వ‌హించాలి. పొర‌పాటున త‌ప్పు జ‌రిగినా.. కావాల‌నే చేసార‌ని వాదించే ఓ వ‌ర్గం ఎప్పుడూ ఉంటుంది.  అలాంటి వాళ్ల‌కు ఛాన్స్ ఇవ్వ‌కుండా.. దేశ గౌర‌వాన్ని కాపాడ వ‌ల‌సిన బాధ్య‌త ప్ర‌తి పౌరుడిపైనా త‌ప్ప‌క ఉంద‌న్న విష‌యాన్ని విస్మ‌రించ‌డానికి లేదు. కొన్నిసార్లు కొంద‌రు ప్ర‌మోష‌న్స్ కోసం కూడా దిశాప‌టానీ సీకే యాడ్ లా ఏదో ఒక వివాదాన్ని క్రియేట్ చేసేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. కానీ చ‌ర‌ణ్ అలా చేయ‌ర‌ని అభిమానులు భావిస్తున్నారు.
Tags:    

Similar News