‘బాహుబలి: ది కంక్లూజన్’ చూడగానే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసిపోయింది. కానీ ఆ సినిమా చూస్తున్నపుడే కొత్త ప్రశ్న మొదలైంది. అసలు భల్లాలదేవుడి భార్య ఎవరు.. అన్నదే ఆ ప్రశ్న. దీనికి సమాధానం దొరక్క జనాలకు పిచ్చెక్కిపోయింది. తొలి భాగంలో భల్లాల భార్యను చూపించకపోతే పోయారు.. రెండో భాగంలో కచ్చితంగా ఆ పాత్ర ఉంటుందనే ఆశించారంతా. కానీ భల్లాల భార్యనే చూపించకుండా సినిమాను లాగించేశాడు రాజమౌళి. ఇది ఆయనకు తెలిసి జరిగిన తప్పేనా కాదా అన్నది తెలియదు. ఐతే ‘బాహుబలి-2’ విడుదలయ్యాక భల్లాల భార్య ఎవరు అనే విషయంలో రకరకాల చర్చలు నడిచాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా జరిగాయి.
ఐతే ఆ వ్యవహారం కొన్నాళ్లు సద్దుమణిగింది కానీ.. ఇప్పుడు రానా పుణ్యమా అని మళ్లీ ఈ వ్యవహారం చర్చల్లోకి వచ్చింది. తన కొత్త సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ టీజర్ లాంచ్ చేసిన నేపథ్యంలో అభిమానులతో ట్విట్టర్ చాట్ చేస్తున్న సమయంలో అతడికి ‘భల్లాల దేవుడి భార్య ఎవరు’ అనే ప్రశ్న ఎదురైంది. ముందు ఈ ప్రశ్నకు సమాధానం దాటవేసే ప్రయత్నం చేశాడు రానా. కానీ జనాలు ఊరుకుంటారా..? మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడిగారు? ఐతే భల్లాలకు భార్య లేదని.. సరోగసీ ద్వారా కొడుకును కన్నాడని ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు రానా. కానీ జనాలు ఒప్పుకోలేదు. మళ్లీ భల్లాల భార్య ఎవరనే ప్రశ్నే సంధించారు. దీంతో ఈసారి లాభం లేదని.. భల్లాల భార్య రాధ అంటూ ‘నేనే రాజు నేనే మంత్రి’లో కాజల్ తో తాను కలిసున్న ఫొటోను షేర్ చేశాడు రానా. దీంతో మధ్యలో కాజల్ లైన్లోకి వచ్చింది. ‘‘ఇక ఏం చెబుతాం.. మాది జన్మ జన్మల బంధం’’ అంటూ గడుసైన సమాధానం ఇచ్చిందామె. ఈ డిస్కషన్ ‘నేనే రాజు నేనే మంత్రి’ ప్రమోషన్ కు బాగానే పనికొచ్చిందిలెండి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/