దగ్గుబాటి రానా ఎట్ట కేలకు ట్రాక్ లో పడ్డట్టేనా? అంటే అవుననే అర్థమవుతోంది. విదేశాల్లో చికిత్స తర్వాత ఆరోగ్యం గానే ఉన్నాను! అంటూ రానా ఎంత చెప్పినా రకరకాలుగా ప్రచారం సాగింది. ఇక ఆ పుకార్లు అన్నిటికీ చెక్ పెట్టి తదుపరి కెరీర్ పై రానా పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు రానా కథానాయకుడి గా వరుసగా భారీ చిత్రాలు క్యూలో ఉన్నాయి. ఓ వైపు `విరాఠపర్వం 1992` చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్న రానా.. మరో వైపు హిరణ్య కశిప లాంటి భారీ విజువల్ గ్రాఫిక్స్ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమాని రానా స్వయం గా నిర్మిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహించనున్నారు. దీంతో పాటే `హాథీ మేరా సాథీ` బహుభాషా చిత్రానికి సంబంధించి ఓ క్లారిటీ తెచ్చే ప్లాన్ లో ఉన్నాడట.
వీటన్నిటినీ మించి రానా సొంతంగా ఒక బ్యానర్ ని ప్రారంభించి అందులో యంగ్ ట్యాలెంటు ను ఎంకరేజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. క్రియేటివ్ కాన్సెప్టుల కు ఓకే చెప్పి వాటి లో కొత్త హీరోలు.. అప్ కం హీరోల కు అవకాశాలు ఇవ్వనున్నాడు. ఇటీవలే రాజ్ తరుణ్ కథానాయకుడి గా ఓ సినిమాని ప్రకటించారు. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తాజాగా ఓ ఇంటర్వ్యూ లో రానా వెల్లడించారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించాల్సి ఉంది. అలాగే ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో ఓ యువ హీరో తో ప్లాన్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ తో కలిసి హిందీ వెర్షన్ ని నిర్మిస్తాడట.
ఓవైపు `విరాఠపర్వం` చిత్రీకరణలో పాల్గొంటూ నే రానా ఇన్ని ప్రాజెక్టుల్ని హ్యాండిల్ చేయనున్నాడు. నిర్మాతగా భారీ సినిమాల ప్రీప్రొడక్షన్ పనులు చూస్తూనే.. సొంత బ్యానర్ లాంచ్ కి సంబంధించిన ప్రణాళిక ను సిద్ధం చేస్తున్నాడట. ఇక సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లు వగైరా ఓటీటీ ప్లానింగుని సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.