బాహుబలికి ప్రశ్నలకు అవినాభావ సంబంధం ఉందేమో. మొదటి పార్ట్ ముగిసిన వెంటనే.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నను ఏళ్ల తరబడి బుర్ర బద్దలు కొట్టేలా చేసిన రాజమౌళి.. తన మలి భాగంలో అంతుచిక్కని ప్రశ్నలు వచ్చేలా చేసేసి సినిమాను ముగించేశాడు. మరో భాగం ఏమీ లేదని చెప్పేసి క్లారిటీ ఇచ్చేసిన జక్కన్న.. కొన్ని లాజిక్ ప్రశ్నలకు సమాధానం మాత్రం చెప్పలేదు.
గొప్ప సినిమా అయినప్పటికీ తప్పులు కామన్. కానీ.. ఆ తప్పును ఒప్పుకుంటే ఆ హుందాతనమే వేరుగా ఉంటుంది. తాజా బాహుబలి సెకండ్ పార్ట్ చూసిన ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ప్రశ్నల్లో ముఖ్యమైంది? భల్లాల దేవ కు భార్య ఉందా? ఉంటే.. ఎందుకు చూపించలేదు? భార్య పాత్రను చూపించకుండానే.. అంత పెద్ద కొడుకును ఎలా చూపిస్తారు? ఆ కొడుకు ఎలా పుట్టాడన్న ప్రశ్న పెద్ద ఎత్తున వ్యక్తమైంది.
అయితే.. ఈ లాజిక్ క్వశ్చన్‌కు జక్కన్న తనదైన స్టైల్లో ఎలాంటి సమాధానం చెప్పకుండా తన దారిన తాను భూటాన్ వెళ్లిపోయాడు. బాహుబలి 2 పార్ట్ ప్రమోషన్ యాక్టివిటీని అమెరికాలో క్లోజ్ చేసేసి.. బాహుబలితో తన జర్నీ పూర్తి అయ్యిందన్న ట్వీట్ చేసేసిన జక్కన్న.. సగటు ప్రేక్షకుడి మదిలో మెదిలే ప్రశ్నలకు మాత్రం బదులివ్వలేదు.
పార్ట్ వన్ లో కానీ.. పార్ట్ 2లో కానీ భల్లాలదేవుడి పెళ్లి ముచ్చట అస్సలు ప్రస్తావించలేదు. భల్లాలదేవుడి పెళ్లి ముచ్చటను సెకండ్ పార్ట్ లో అయినా చూపిస్తారని అనుకున్నా.. ఎడిటింగ్ లో తేడానో.. లేక కథలో దొర్లిన పొరపాటో కానీ ఆ క్వశ్చన్‌కు ఆన్సర్ ఇవ్వలేదు.
భల్లాల దేవుడి కొడుకు క్యారెక్టర్‌ను అడివి శేష్ చేత చేయించారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు ముందు అతడ్ని శివుడు చంపేస్తాడు. కథలో కీలకమైన భల్లాలదేవుడికి పెళ్లి చేసుకొని ఉంటే.. భార్య ఎవరన్న క్వశ్చన్ వచ్చి.. పలువురు దీనికి సమాధానం చెప్పాలన్న మాటను సోషల్ మీడియాలో భారీగానే చర్చ చేశారు. అయితే.. ఈ ప్రశ్నకు ఇప్పటివరకూ ఎవరూ సమాధానం చెప్పలేదు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో రానాకు ఇదే ప్రశ్న ఎదురైంది. భల్లాల దేవుడి కొడుకు భద్రకు తల్లి ఎవరన్న ప్రశ్నకు రానా బదులిస్తూ.. తనదైన శైలిలో రియాక్ట్ అయి.. భద్రకు తల్లిలేదు. అతడు సరోగసి పద్దతిలో పుట్టాడు అంటూ సరదాగా చెప్పేసి నవ్వించే ప్రయత్నం చేశారు. రానా మాటల్ని చూస్తే.. భల్లాలదేవుడి కొడుకు ఎలా పుట్టాడన్న విషయంపై డౌట్స్ రావటానికి ఎడిటింగ్ లోపం కాదని.. కథలోనే ఈ ముచ్చటను మిస్ అయ్యారన్న మాట వినిపిస్తోంది. అందుకే.. తనకు తెలీని ప్రశ్నకు సమాధానాన్ని చెప్పే విషయంలో రానా కాసింత సమయస్ఫూర్తితో వ్యవహరించి నవ్వించేశాడని చెప్పాలి