నాకేదో అయ్యింది అని పెట్టడం ఎందుకు??

Update: 2016-05-27 14:15 GMT
ఈ సెలబ్రిటీలతో ఇదే వచ్చింది ప్రాబ్లమ్. తమ సోషల్‌ నెట్వర్కులో ఏదో పోస్ట్ చేస్తారు.. దాని గురించి ఏదైనా రాస్తే.. అది కరక్టు కాదు.. అంటూ ఇంకోటేదో చెబుతారు. అదిగో.. బల్లాలదేవ రానా కూడా సేమ్‌ ఇదే విధంగా చేశాడు.

''పాడైన నా మణికట్టుకు.. టేప్‌ వేసుకుని మరి బాహుబలి 2 కోసం కఠోరంగా బాడీ బిల్టింగ్‌ చేస్తున్నా'' అంటూ ఒక ట్వీటేశాడు రానా. తన వ్రిస్ట్ కు నిజంగానే టేప్‌ ఒకటి వేసుకొని.. ఆ ఫోటో కూడా షేర్‌ చేశాడు. ఇక అదే బేస్‌ గా చేసుకొని.. చాలా నార్త్ ఛానళ్ళు.. పత్రికలు.. మనోడి గురించి న్యూస్ వేశాయి. వెంటనే ఆ వార్తలపై స్పందించిన రానా.. ''నేనేది విరగ్గొట్టుకోలేదు.. అది కేవలం ఒక చిన్న దెబ్బ మాత్రమే'' అంటూ సెటైరికల్ గా సదరు మీడియా వార్తలపై స్పందించాడు.

అసలు అంత చిన్న ఇంజ్యూరి అయినప్పుడు.. దాని గురించి చాలా గొప్పగా ఆన్‌ లైన్ లో పెట్టడం ఎందుకు? అలా పెట్టబట్టే ఇలా ఏదో అయ్యిందంటూ ఎవరైనా రాస్తారు.. ఒక స్పెషల్‌ స్టోరీయే వేస్తారు!! మళ్లీ వేశాక అది సరిగ్గా లేదంటూ కామెంట్‌ చేయడం ఎందుకు? కాస్త ఓవర్‌ కదూ?
Tags:    

Similar News