బాహుబలి తర్వాత రానా స్టేచర్ మారిపోయింది. ఆయన కనపడితే చాలు థియోటర్స్ దద్దరిల్లుతున్నాయి. ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అలాగే ఆయన నటిస్తున్న సినిమాలకు క్రేజ్ అలాగే ఏర్పడుతోంది. ఆయన తాజా చిత్రం విరాటపర్వం కోసం జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన్ని గెస్ట్ రోల్ గా చేయటానికి ఒప్పించారనే వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఏ సినిమాలో ఆయన చేస్తున్నారు..ఏంటా మేటర్ అనేది చూస్తే...
ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో గోపించంద్ హీరోగా నటించబోతున్నాడు. తేజ దర్శకత్వంలో గతంలో గోపీచంద్ ‘జయం’, ‘నిజం’ సినిమాలు చేసారు. అయితే వాటిల్లో విలన్ గా నటించాడు గోపీచంద్. ఇప్పుడు అదే తేజ దర్శకత్వంలో గోపీచంద్ హీరో గా చేయబోతున్న తొలి సినిమా ఇది. ‘అలిమేలుమంగ వేంకటరమణ’ టైటిల్ రానున్న ఈ సినిమా ఒక గెస్ట్ రోల్ ఉందట. అందులో రానా దగ్గుపాటి నటించనున్నట్లుగా వినిపిస్తోంది.
కేవలం ఒక సీన్ ఉండే ఈ పాత్ర క్లైమాక్స్ లో వస్తుందని చెప్తున్నారు. తేజ దర్శకత్వంలో రానా హీరోగా వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా మంచి హిట్టేంది. ఆ అనుబంధంతో తేజ ఈ సినిమాకు రానాని ఒప్పించినట్లు తెలుస్తోంది. అలాగే సినిమాకి రానా చేయబోయే పాత్ర ఎంతో కీలకమట. అందుకే ఈ పాత్ర చేయటానికి రానా ఓకె చెప్పాడంటున్నారు. కరోనా కేసులు తగ్గి అన్నీ అనుకూలిస్తే...జూన్ నుండి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీస్ సంస్థ నిర్మించనుంది. ఇప్పటికే తేజ ఈ చిత్ర స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేశారు. రీసెంట్ గా గోపీచంద్‌ను కలిసి కథ ఫైనల్ నేరేషన్ ని వినిపించినట్లు సమాచారం. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పూర్తి స్దాయి ఎంటర్టైనర్ గా తేజ ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో గోపీచంద్ పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందని, తెరపై ఆయన్ని తేజ చాలా విభిన్నంగా ఆవిష్కరించబోతున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ ‘సీటీమార్’ చిత్రం చేస్తున్నారు.