రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ `బాహుబలి` తెలుగు సినిమా స్వరూపాన్నే మార్చేసింది. ఈ సినిమాతో టాలీవుడ్ సత్తా ఇంటర్నేషనల్ లెవల్ అని జక్కన్న ప్రపంచానికి చాటి చెప్పారు. బాలీవుడ్ వాళ్లే కాదు.. హాలీవుడ్ స్థాయి చిత్రాల్ని మనం కూడా తీయగలం అని సౌత్ సహా అన్ని పరిశ్రమల్లో సినీ దిగ్గజాల్లో ధైర్యాన్ని నింపింది. తెలుగు సినిమా 100 కోట్ల మార్క్ ని అధిగమించలేదనుకుంటున్న సమయంలో 2000 కోట్ల క్లబ్ అయినా చేరగలమని `బాహుబలి`తో రాజమౌళి ప్రపంచానికి చాటారు. ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో అన్ని భాషల్లోనూ భారీ చిత్రాల నిర్మాణం ఊపందుకుంది.
ఆ కాన్ఫిడెన్స్ వల్లనే పాన్ ఇండియా సినిమాల వెల్లువ పెరగడానికి కారణమైంది. రుద్రమదేవి- సాహో- సైరా- థగ్స్ ఆఫ్ హిందూస్తాన్- పానిపట్- మమాంగం.. వంటి భారీ చిత్రాల రూపకల్పనకు బాహుబలి ఫ్రాంఛైజీనే కారణమైంది. ప్రస్తుతం సెట్స్ పై వున్న బ్రహ్మాస్త్ర- తానాజీ... పాన్ ఇండియా కేటగిరీ చిత్రాలే. తాజాగా ఇదే తరహాలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో `హిరణ్యకశిప` తెరపైకి రాబోతోంది. ఈ చిత్రం కోసం గత రెండేళ్లుగా ప్రీప్రొడక్షన్ వర్క్ అమెరికా- హైదరాబాద్ సహా పలు చోట్ల జరుగుతోంది. దర్శకుడు గుణశేఖర్ `రుద్రమదేవి` తరువాత ఈ చిత్ర ప్రీప్రొడక్షన్ వర్క్ ని మొదలు పెట్టారు. ఈసారి ప్రొడక్షన్ డిజైన్ పరంగా సుదీర్ఘ సమయం తీసుకుని ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. పనిదినాల కారణంగా బడ్జెట్ పెరుగకుండా.. అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేసేలా ప్రతిదీ పక్కాగా ప్రీప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారట.
అందుకే ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేసేందుకు ఆస్కారం ఉందని.. భారీ విజయాన్ని సాధిస్తుందని డి. సురేష్ బాబు పదే పదే చెబుతున్నారు. ఎప్పుడు అడిగినా ఇదే మాటని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్.. గ్రాఫిక్ డిజైనర్ పని చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా పని పూర్తి చేసినట్టు టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ని ప్రారంభించి రికార్డు టైమ్ లో పూర్తి చేసి భారతీయ సినీ దిగ్గజాలనే విస్మయపరచాలని ప్లాన్ చేస్తున్నారట.