బాలీవుడ్ లో పలువురు స్టార్ కపుల్స్ పెళ్లి చేసుకుని ఓ ఇంటివారు అవుతున్నారు. దీపికా పడుకొనే - రణ్ వీర్ సింగ్ ఇప్పటికే ఓ ఇంటివారు అవగా.. ఇప్పుడు మరో క్రేజీ కపుల్ త్వరలో ఓ ఇంటివారు అవుతున్నట్టు కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఎంగేజ్మెంట్ తో తెరపడనుంది. స్టార్ హీరోయిన్ ఆలియా భట్ - క్రేజీ హీరో రణబీర్ కపూర్ ప్రేమాయణంపై కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. వచ్చేనెలలో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకొన్నట్టు తెలుస్తోంది. వీరి వివాహం 2020 సమ్మర్ లో ఉంటుందని తెలుస్తోంది. ఈ ఎంగేజ్ మెంట్ కార్యక్రమం ఎప్పుడో ? జరగాల్సి ఉన్నా రణబీర్ తండ్రి రిషీకపూర్ కొద్దిరోజులుగా తీవ్రమైన అస్వస్థతకు గురవడంతో వాయిదా పడుతూ వస్తోంది.
ప్రస్తుతం ఆయన కోలుకుంటోన్న నేపథ్యంలో వీరిద్దరు ఎంగేజ్ మెంట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి భారీ బడ్జెట్ సినిమా బ్రహ్మాస్త్రలో నటిస్తున్నారు. ఆయాన్ ముఖర్జి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ - టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రల్లో కనిపిస్తారు. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా తొలి భాగం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అలియా భట్ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ సరసన అల్లూరి సీతారామరాజు పాత్రకు జోడీగా నటిస్తోంది.
ఇక రణబీర్ - ఆలియా ఎంగేజ్ మెంట్ పై వీరిద్దరిలో ఎవరో ? ఒకరు క్లారిటీ ఇస్తే ఇంకా బాగుంటుంది. తనకు చిన్నప్పటి నుంచే రణబీర్ అంటే చాలా ఇష్టమని ఆలియా ఎన్నోసార్లు ఓపెన్ గానే చెప్పింది. బీ టౌన్ లో జరిగే ప్రతి పార్టీకి - ఫంక్షన్ కు ఈ జంట ఎప్పుడూ కలిసే వెళుతుంటారు. తాజాగా ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగిన వినాయక చవితికి కూడా వీరు కలిసే వెళ్లడంతో పాటు అందరి దృష్టిలోనూ పడ్డారు.