అలియాకు ర‌ణ్ బీర్ స‌ర్ ప్రైజింగ్ గిఫ్ట్‌

Update: 2022-04-14 09:30 GMT
బాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ ర‌ణ్ బీర్ క‌పూర్ - అలియా భ‌ట్ వివాహం ఎట్ట‌కేల‌కు జ‌రుగుతోంది. గ‌త కొంత కాలంగా వివిధ కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ ప్రేమ ప‌క్షుల పెళ్లి ఏప్రిల్ 14న అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ బుధ‌వారం మెహెందీ ఫంక్ష‌న్ ని గ్రాండ్ గా నిర్వ‌హించారు. ఉద‌యం నుంచే ర‌ణ్ బీర్ ఇంటి ముందు సిబ్బంది భ‌ద్ర‌తా ఏర్పాట్లు నిర్వ‌హించారు. దీంతో బాలీవుడ్ లో భారీ సంద‌డి మొద‌లైంది. ఇండ‌స్ట్రీకి చెందిన టాప్ సెల‌బ్రిటీలంతా ఈ పెళ్లి వేడుక‌కు రెడీ అయిపోతున్నారు.

ఇప్ప‌టికే క‌పూర్ ఫ్యామిలీకి చెందిన స్టార్స్ అంతా మెహెందీ వేడుక‌లో మెరిసారు. ర‌ణ్ బీర్ క‌పూర్ ఫ్యామిలీ సెంటిమెంట్ గా భావించే ఆర్కే స్టూడియోలో ర‌ణ్ బీర్ - అలియాల పెళ్లికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. గురువారం రాత్రి 7 గంట‌ల‌కు వీరి వివాహం జ‌ర‌గ‌బోతోంది.

బుధ‌వారం రాత్రి జ‌రిగిన మెహెందీ ఫంక్ష‌న్ లో క‌ర‌ణ్ జోహార్‌, అయాన్ ముఖ‌ర్జీ, రిద్దిమా క‌పూర్‌, నీతూ క‌పూర్‌, సోనియా ర‌జ్డాన్‌, షాహీన్ భ‌ట్‌, పూజా భ‌ట్‌, మ‌హేష్ భ‌ట్‌, క‌రీనా క‌పూర్‌, క‌రిష్మా కపూర్ వంటి వారంతా హాజ‌ర‌య్యారు.

గురువారం రాత్రి జ‌రగ‌నున్న పెళ్లిలో బాలీవుడ్ తో పాటు ద‌క్షిణాదికి చెందిన ప్ర‌ముఖుల కూడా భారీ స్థాయిలో పాల్గొన‌బోతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ర‌ణ్ బీర్ - అలియాల పెళ్లి బాంద్రాలో భారీ స్థాయిలో జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఏర్పాట్ల‌న్నీ పూర్త‌యిపోయాయి. ఇదిలా వుంటే కాబోయే వైఫ్ కి ర‌ణ్ బీర్ స్పెష‌ల్ గిఫ్ట్ గా ఏం ఇవ్వ‌బోతున్నాడ‌న్న‌ది ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది.

ర‌ణ్ బీర్ క‌పూర్‌, అలియా భ‌ట్ గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో వున్న విష‌యం తెలిసిందే. ల‌వ్ బ‌ర్డ్స్ పెళ్లికి మ‌రి కొన్ని గంట‌ల్లో ఒక్క‌టి కాబోతుండ‌టంతో ఈ ప్రేమ జంట ఒక‌రికి ఒక‌రు ఎలాంటి బ‌హుమ‌తులు ఇచ్చి పుచ్చుకోబోతున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో ర‌ణ్ బీర్ క‌పూర్ కాబోయే త‌న వైఫ్ అలియాకు స‌ర్ ప్రైజింగ్ గిఫ్ట్ ని ఇవ్వ‌బోతున్నార‌ట‌. అలియా కోసం 8 వ‌జ్రాలు పొదిగిన వెడ్డింగ్ బ్రాండ్ ని చేయించార‌ట‌. ఈ వెడ్డింగ్ బ్యాండ్ ని అలియాకు ర‌ణ్ బీర్ పెళ్లిలో అలంక‌రించ‌నున్నాడ‌ట‌.

క‌పూర్ కుటుంబానికి 8 ల‌క్కీ నంబ‌ర్ కావ‌డంతో ర‌ణ్ బీర్ ... ఆ సెంటిమెంట్ ప్ర‌కారం అలియా కోసం 8 వ‌జ్రాలు పొదిగిన వెడ్డింగ్ బ్యాండ్ ని బ‌హుమ‌తిగా ఇవ్వ‌బోతున్నాడ‌ని, దీని విలువ భారీగానే వుంటుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం అలియాభ‌ట్‌, ర‌ణ్ బీర్ క‌పూర్ జంట‌గా అయాన్ ముఖ‌ర్జీ డైరెక్ట్ చేస్తున్న 'బ్ర‌హ్మాస్త్ర‌'లో న‌టించారు. ఈ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది.
Tags:    

Similar News