ఇప్పుడు చాలామంది ఫిలిం లవ్వర్స్ కళ్ళన్నీ కూడా.. రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన 'రంగుల రాట్నం' సినిమాపై పడిపోయాయ్. ఎందుకంటే ఈ సినిమాను చూస్తుంటే ఇప్పుడు అందరికీ ఒక మెగా సందేహం రాక మానదు. అసలు ఈ సినిమా ఏంటో కూడా మొన్నటివరకు ఎవ్వరికీ తెలియదు కాని.. ఇప్పుడు మాత్రం సడన్ గా సంక్రాంతి రేసులోకి వచ్చి ఉడుకు పుట్టిస్తోంది.
గతేడాది సంక్రాంతి సమయంలో.. అసలు మెగాస్టార్ 150వ సినిమా మరియు నందమూరి బాలకృష్ణ 100వ సినిమా వస్తున్నప్పుడు.. మధ్యలో ఎవరొచ్చినా కూడా క్రష్ అయిపోతారు అని అందరూ అనుకున్నారు. కాని ఖైదీ నెం 150 వేడిని.. శాతకర్ణి దాడిని తట్టుకుని.. శతమానం భవతి రికార్డులు సృష్టించింది. హీరో శర్వానంద్ కెరియర్లోనే ఆ సినిమా సంచలన కలక్షన్లు వసూలు చేసింది. చూస్తుంటే ఇప్పుడు కూడా రాజ్ తరుణ్ అదే తరహాలో కామ్ గా వచ్చేసి.. ఒకవైపు పవన్ కళ్యాన్ అజ్ఞాతవాసి.. మరోవైపు బాలయ్య జైసింహతో పోటీ పడుతూ.. చక్కగా ఒక హిట్టు కొట్టేస్తాడంటారా?
అయితే శతమానం భవతి తరహాలో విజయం సాధించడం అనేది కంటెంట్లో ఉన్న వాడి వేడి బట్టే ఉంటుంది. కాకపోతే సెలవల సీజన్ కాబట్టి.. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డు వసూళ్లు తెచ్చుకునే స్థాయి ఉంటుంది. అయితే ప్రమోషన్ అంటే ప్రాణమిచ్చేసే నాగార్జున ఇప్పుడు రంగుల రాట్నం విషయంలో మాత్రం చాలా స్లోగా వ్యవహరిస్తూ ఇలా లేటుగా ప్రమోషన్ చేస్తున్నారంటే.. ఏదో తేడా కొట్టట్లేదూ?