స‌మంత‌ని ఆకాశానికి ఎత్తేసిన ర‌ణ‌వీర్ సింగ్!

Update: 2022-08-03 02:30 GMT
స‌మంత బాలీవుడ్ ని రౌండ‌ప్ చేసిన సంగ‌తి తెలిసిందే. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్టులు లైన్ లోకి తెస్తూ షాక్ ల మీద షాక్ ఇస్తుంది. ఇప్పుడే వెళ్లి అప్పుడే అన్ని ప్రాజెక్ట్ లు ఎలా?  అనుకునేలా దూసుకుపోతుంది. ర‌ష్మిక మంద‌న్న‌...పూజాహెగ్డేల‌కు పోటీగా స‌మంత కూడా త‌యారైంది. ముందుగా వార్ ర‌ష్మిక‌-పూజాల మ‌ధ్య షురూ అయింది.

ఇద్ద‌రు అవ‌కాశాలు పోటీ ప‌డి ద‌క్కించుకోవ‌డంతో ఎవ‌రిది పై చేయి అన్న‌ది? చెప్ప‌డం క‌ష్టంగా మారింది. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య  నువ్వా?  నేనా? అన్న తీరున‌  పోటీ సాగుతుంద‌ని బాలీవుడ్ మీడియా సైతం వెడెక్కించింది. తాజాగా వాళ్లిద్ద‌రి మ‌ధ్య‌లోకి స‌మంత కూడా దూరింది. దీంతో ఇప్పుడు వాళ్ల ముగ్గురి మ‌ధ్య‌లో త్రిముఖ‌పోరు షురూ అయింది.

ఒక‌రికొక‌రు పోటీప‌డి  అవకాశాలు ద‌క్కించుకుంటున్నారు. ఇదే మూవ్ మెంట్ లో స‌మంత ప్ర‌ఖ్యాత క‌ర‌ణ్ జోహార్ టాక్ షోకి హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఈ షో వేదిక‌గా స‌మంత ఎన్నో సంచ‌ల‌న విష‌యాలు రివీల్ చేసింది. చివ‌రికి చైత‌న్య‌తో విడాకుల తంతును కూ ఈ వేదిక సాక్షిగా ఓపెన్ అయింది.

ఇదే షోలో ర్యాపిడ్ ఫైర్ లో  బ్యాచిల‌ర్ పార్టీని హోస్ట్ చేస్తే అక్క‌డ డాన్స్ చేయ‌డానికి ఏ ఇద్ద‌రు హీరోల్ని తీసుకుంటావ్ అని అడ‌గ‌గా..స‌మంత అందుకు ర‌ణ‌వీర్ సింగ్ ..ర‌ణ‌వీర్ సింగ్ అని అత‌ని పేరు రెండుసార్లు చెప్పింది. ఇద్ద‌రు క‌లి సి చేసిన యాడ్ షూట్ త‌ర్వాత మంచి స్నేహితుల‌య్యాం? అన్న విష‌యాన్ని తెలిపింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా ర‌ణ‌వీర్ సింగ్ కూడా లైన్ లోకి వ‌చ్చాడు. స‌మంత‌ని ఆకాశానికి ఎత్తేసాడు. ''స‌మంత మంచి మ‌నిషి. న‌టిగానూ అమె అంటే ఇష్టం. వ్య‌క్తిగా ఇంకా అభిమానిస్తా. జోకులు వేసి అంద‌ర్నీ న‌వ్విస్తుంటుంది.

చాలా సాధార‌ణంగా క‌నిపిస్తుంది. అలా ఉండ‌టానికి ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంది. వెరీ ట్యాలెంటెడ్ హీరోయిన్.  భ‌విష్య‌త్ లో స‌మంత‌తో క‌లిసి మంచి సినిమాలు చేయాలని ఉంది' అని తెలిపారు. మ‌రి ర‌ణ‌వీర్ ప్ర‌శంస‌ల‌పై సామ్  రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News