మలయాళం నటుడు-నిర్మాత విజయ్ బాబు పై అత్యాచారం కేసు నమోదైంది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు ఎర్నాకుళం పోలీసులు 376-506-323 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. దీంతో పోలీసులు యాక్షన్ లోకి దిగడానికి రెడీ అవుతున్నారు. విజయ్ బాబుని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచేందుకు సిద్దం అవుతున్నారు. ఇంతకీ విజయ్ బాబు పై అత్యాచారం ఆరోపణలు ఎలా తెరపైకి వచ్చాయి? ఆయనపై ఆరోపణలు చేసిన ఆ మహిళ ఎవరు? అన్నది తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని విజయ్ బాబు ఓ మహిళని లోబరుచుకున్నాడని..ఇష్టం లేకున్నా లైంగికంగా వేధించాడని ఓ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఆడిషన్ పేరుతో డైలీ కొచ్చిలోని ప్లాట్ కి పిలిపించి అఘాయిత్యానికి పాల్పడినట్లు కోజికోడ్ కి చెందిన మహిళ ఫిర్యాదులో తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఆరోపణలపై నటుడు విజయ్ స్పందించారు. ''తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఈ వివాదంలోకి కావాలనే ఆ మహిళ లాగుతుందని..అంత ఈజీగా ఆమెని వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు. పరువు నష్టం దావా కేసు వేసి నిర్దోషిగా నిరూపించుకుంటానన్నారు.
గత రాత్రి విజయ్ ఫేస్ బుక్ లైవ్ లో ఈ విషయాలు వెల్లడించారు. ఈ కేసులో అసలు బాధితుడ్ని తాను అని..ఎలాంటి తప్పు చేయని నాపై ఆరోపణలు చేసి డబ్బు గుంజాలని చూస్తున్నట్లు ప్రత్యారోపణ చేసారు.
తప్పు చేయని మగవాడిని రక్షించడానికి చట్టాలు లేవు. కానీ తప్పులు చేసిన కొందరు మహిళల్ని రక్షించడానికి మహిళా చట్టాలు ఉన్నాయన్నారు. ఈ విషయం తనని ఎంతగానో బాధపెడుతుందన్నారు. పరువు నష్టం కేసు వేసి రోడ్డుకీడ్చగలను. కానీ ఆమె కుటుంబం గురించి ఆలోచించి ఎలాంటి కేసులు పెట్టడం లేదన్నారు.
తాను కేవలం సమాధానం తన తల్లికి..భార్యకి..సోదరికి మాత్రమే చెబుతానన్నారు. ఆ మహిళ డిప్రెషన్ లో ఉండి కొన్ని రకాల మెసేజ్ లు పంపించిందన్నారు. వాటికి సంబంధించిన 400 స్ర్కీన్ షాట్లు కూడా తీసి పెట్టాను అన్నారు. విజయ్ బాబు ఫ్రైడ్ ఫిల్మ్స్ హౌస్ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. 'పిలిప్స్ అండ్ ది మంకీ పెన్' చిత్రానికి గాను రాష్ర్ట స్థాయి అవార్డు కూడా అందుకున్నారు.