RAPO - మాస్ కాంబినేషన్స్.. గేట్ రెడీ!

Update: 2023-05-11 12:12 GMT
దేవదాసు చిత్రంతో 2006లో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇప్పటికీ యంగ్ అండ్ డైనమిక్ హీరోగా కొనసాగుతున్న రామ్ పోతినేని గురించి అందరికీ తెలిసిందే. తన అందం, అభినయం, యాటిట్యూడ్, స్పాంటేనియస్ కామెడీ, డైలాగ్ డెలివరీతో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించాడు. జగడం, రెడీ, మస్కా గణేష్, రామరామ కృష్ణకృష్ణ, కందిరీగ, ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త వంటి సూపర్ డూపర్ హిట్టు చిత్రాల్లో నటించాడు.

ఆ తర్వాత నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే వంటి చిత్రాలతో తెలుగు సినీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తనలోని మాస్ యాంగిల్ ని చూపించాడు.

బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. రామ్ కెరియర్ లోని ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమాతోనే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంతో ఆయన మళ్లీ ఫాంలోకి వచ్చినట్లు అంతా భావించారు.

కానీ ఆ తర్వాత విజయ్ దేవర కొండతో తీసిన లైగర్ చిత్రం బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ క్రమంలోనే ఆయన మరో కథతో రామ్ పోతినేని వద్దకు వచ్చాడు. వీరిద్దరి కాంబోలో మరో చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను మే 15వ తేదీ అంటో సోమవారం రోజు ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో మళ్లీ సినిమా వస్తుందని తెలియడంతో అభిమానులు తెగ ఎగ్జైట్ అవుతున్నారు.

ఎలాగైనా సరే మరోసారి హిట్టు కొట్టి తన కెరియర్ గ్రాఫ్ ను లేపాలనే కసితో ఉన్న పూరీ జగన్నాథ్ రామ్ కోసం ఓ అద్భుతమైన కథ రాసుకున్నాడని సమాచారం. వీరిద్దరి కాంబోలో రాబోతున్న చిత్రం ఏ రేంజ్ లో ఉండనుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే. మరోవైపు రామ్ పోతినేని.. బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయబోతున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై.. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి BoyapatiRAPO అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అయితే త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుందో.

Similar News