కిరాక్ పార్టీ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన...కన్నడతోపాటు తెలుగు - తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా విజయ్ దేవరకొండతో జత కట్టిన రష్మిక 'గీత గోవిందం' తో ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు నిర్మించిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక ఎంగేజ్ మెంట్ గురించిన ఒక వార్త కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రక్షిత్ శెట్టితో ఆమె ఎంగేజ్ మెంట్ బ్రేకప్ అయిందని పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పుకార్లు పై తాజాగా రష్మిక పీఆర్వో స్పందించారు.
టాలీవుడ్ - మాలీవుడ్ - కోలీవుడ్ లలో రష్మిక మంచి అవకాశాలు దక్కించుకుంటోన్న సంగతి తెలిసిందే. 'ఛలో' లో రష్మిక ఆకట్టుకోవడంతో టాలీవుడ్ లో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. అర్జున్ రెడ్డితో రష్మిక కలిసి నటించిన`గీత గోవిందం`విడుదలకు ముందు రష్మిక ఎంగేజ్ మెంట్ గురించిన ఓ వార్త వైరల్ అయింది. రక్షిత్ శెట్టితో రష్మిక మందనకు జరిగిన ఎంగేజ్ మెంట్ రద్దయిందని వదంతులు వస్తున్నాయి. ఆ పుకార్లపై రష్మిక మందన పీఆర్వో స్పందించారు. రష్మిక .. రక్షిత్ శెట్టి ఎంగేజ్ మెంట్ బ్రేకప్ కాలేదని, ఆ పుకార్లలో ఎంతమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. వాళ్లిద్దరి మధ్య లవ్ బాండ్ చాలా బలమైనదని, ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టమని స్పష్టం చేశారు. వారిద్దరూ ఎప్పటిలాగే కలిసి ఫంక్షన్స్ కి వెళుతున్నారని, ఎంగేజ్ మెంట్ రద్దయిందనే వార్తలను నమ్మవద్దని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.