టాలీవుడ్ లో మొదటి సినిమా ఛలోతో మంచి బ్రేక్ అందుకున్న శాండల్ వుడ్ బ్యూటీ రష్మిక మండన్న 15న విడుదల కానున్న గీత గోవిందం మీద భారీ ఆశలు పెట్టుకుంది. ఇది సాధించే విజయంతో అవకాశాలు వెల్లువలా వస్తాయనే నమ్మకంతో ఉంది. నిజానికి ఈ బ్యూటీకి గతంలోనే ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన కిరిక్ పార్టీ లో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడటం అది నిశ్చితార్థం దాకా దారి తీయడం చకచకా జరిగిపోయాయి. కానీ ఇప్పుడు మాత్రం ఇది పెళ్లి దాకా వెళ్లేందుకు కాస్త టైం పట్టేలా ఉందని ప్రముఖ ఇంగ్లీష్ డైలీ డెక్కన్ క్రానికల్ ప్రకారం అందిన తాజా సమాచారం.
నిజానికి రష్మిక పెళ్లి కుదిరాక గీత గోవిందం లాంటి సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అంత రొమాంటిక్ గా యాక్ట్ చేయటం గురించి సోషల్ మీడియాలో ట్రాలింగ్ జరిగింది. మన దగ్గర కామన్ కానీ కన్నడలో పెళ్ళైన అమ్మాయిలు గ్లామర్ పాత్రలు చేయటం చాలా తక్కువ. అందుకే రష్మిక మీద అన్ని కామెంట్లు వచ్చాయి. దానికి తను ధీటుగానే బదులిచ్చింది. అది వేరే విషయం. కానీ తెలుగుతో పాటు కన్నడలో సైతం మంచి అవకాశాలు వస్తున్న తరుణంలో పెళ్లి చేసుకుని ఇబ్బంది పడటం ఎందుకు అని ఆలోచించిన రష్మిక కొంత కాలం పెళ్ళికే కాదు ఎంగేజ్మెంట్ కు కూడా బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యిందని కన్నడతో పాటు పలు ఇతర బాషా మీడియాలోను వరుస కథనాలు వస్తున్నాయి. కాబోయే భర్త కూడా నటుడే కాబట్టి అర్థం చేసుకుంటాడు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు వాటి సారాంశం.
ఇది తానుగా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. తెలుగులో ఒకటి రెండు హిట్లు వస్తే మంచి కెరీర్ ఉన్న నేపధ్యంలో ఇప్పుడు తొందరపడటం ఎందుకనే అభిప్రాయంలో ఉన్నట్టు కన్నడ మీడియా టాక్. అయినా ఒక పక్క సమంతా పెళ్ళికి కెరీర్ కి సంబంధం అన్న రీతిలో వరస హిట్లతో రుజువు చేస్తూనే ఉన్న తరుణంలో రష్మిక మండన్నపెళ్లి చేసుకోవడంలో తప్పేమి లేదు. కానీ సామ్ కెరీర్ లో పీక్స్ చూసాక పెళ్లి చేసుకుంది. కానీ రష్మిక ఇంకా బిగినింగ్ లో ఉంది. సో ఇలా ఆలోచించడం సరికాదు అనలేం కాబట్టి నిర్ణయం తనకే వదిలేయడం బెటర్.