దేవదాస్ కోసం సొంత గొంతులో గీత!

Update: 2018-08-26 09:08 GMT
తెలుగులో ఉన్న హీరోయిన్స్ లో చాలామంది పరాయి భాషలకు చెందిన వారు కావడంతో దాదాపు అందరికీ ప్రొఫెషనల్స్ తో డబ్బింగ్ చెప్పించాల్సి వస్తోంది.  కానీ కొంతమంది హీరోయిన్లు ఈమధ్య కష్టం అయినప్పటికీ సొంతగా డబ్బింగ్ చెప్పుకునేందుకు ముందుకు వస్తున్నారు..  ఇప్పుడు ఆ లిస్టు లో 'గీత' కూడా చేరుతుందట.

'ఛలో' లాంటి హిట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ హీరోయిన్ రష్మిక మందన్న తన మలి చిత్రం 'గీత గోవిందం' తో క్రేజీ హీరోయిన్ గా మారింది. ఇక 'దేవదాస్' లాంటి పాజిటవ్ బజ్ ఉన్న సినిమా లైన్ లో ఉంది.  అక్కినేని నాగార్జున - నాని లు హీరోలు గా నటిస్తున్న ఈ మల్టిస్టారర్ సినిమాలో రష్మిక హీరోయిన్.  నానికి జోడీగా నటిస్తోంది.  ఈ సినిమాలో రష్మిక తన పాత్రకు సొంతంగా డబ్బింగ్  చెప్పుకోవాలని డిసైడ్ అయిందట.  

అసలు  'గీత గోవిందం' లోనే తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవాలని డిసైడ్ అయినా తన బిజీ షెడ్యూల్ కారణంగా కుదరలేదట.  ఈసారి మాత్రం 'దేవదాస్' కు తన సొంత డబ్బింగ్ అని ఇప్పటికే ఫిలిం మేకర్స్ కు చెప్పిందట.  షూటింగ్ కంప్లీట్ కాగానే తన డబ్బింగ్ పార్ట్ కంప్లీట్ చేస్తుందని సమాచారం.  సో. గెట్ రెడి ఫర్ రష్మిక రియల్ వాయిస్ గయ్స్ .
Tags:    

Similar News