అప్పటివరకూ నమ్మొద్దు అంటున్న గీత!

Update: 2018-08-05 07:21 GMT
'ఛలో' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను మొదటి సినిమాతోనే మెప్పించింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న.  ఇప్పుడు టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'గీత గోవిందం' తో మరోసారి మనముందుకు రానుంది.  ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రమోలతో ఈ సినిమాపై  మంచి బజ్ నెలకొని ఉంది. ఆగష్టు 15 న రిలీజ్ కానున్న ఈ సినిమా సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉంది రష్మిక.

ఈ సినిమా సంగతి ఇలా ఉంటే, రష్మిక ఈమధ్య ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో చాట్ చేసింది.  వాళ్లతో మాట్లాడుతూ "అదంతా ఫన్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు.. మీరు ఎంజాయ్ చెయ్యండి. " అంతే కాకుండా "మీరెవ్వరు నామీద వచ్చే వార్తలను నమ్మొద్దు ఏదైనా ఉంటే నేను సోషల్ మీడియా పేజి లో మీకు నేనే చెప్తాను.' అని క్లారిటీ ఇచ్చింది.   మరిది ఎందుకోసం చెప్పిందో చాలామందికి అర్థం కాలేదు. రష్మికకు కన్నడ ఫిలింమేకర్ రక్షిత్ శెట్టి తో కొన్ని నెలల ముందు ఎంగేజ్మెంట్ అయింది. కానీ ఈమధ్య రష్మిక తన ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకుంటోందని వార్తలు గుప్పుమన్నాయి.  

దానికితోడు 'గీత గోవిందం' సినిమాలో విజయ్ వీపెక్కిన పోస్టర్ కూడా విమర్శలకు దారితీసింది. త్వరలో పెళ్లి చేసుకోబోయే రష్మిక అలాంటి సీన్స్ లో నటించడమెందుకని విమర్శలు వచ్చాయి.  పైగా కొత్త సినిమాలను వరసగా సైన్ చేస్తుండడంతో రష్మిక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినట్టేనని నమ్మారు కూడా.  వీటన్నిటికి తన స్టైల్ లో ఇలా క్లారిటీ ఇచ్చిందేమో 'గీత'.
Tags:    

Similar News