యంగ్ మేకర్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో ఫేమస్ మేకర్ గా ఎదుగుతోన్న సంగతి తెలిసిందే. 'అర్జున్ రెడ్డి' తో తొలి సక్సెస్ అందుకున్న సందీప్ అటుపై అదే చిత్రాన్ని బాలీవుడ్ లోనూ రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం రాక్ స్టార్ రణబీర్ కపూర్ కథానాయకుడిగా 'యానిమల్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్ మూవీ.
మనుషుల్లో మారుతోన్న స్వభావాల చుట్టూ తిరిగే ఇంట్రెస్టింగ్ స్ర్కిప్ట్ తో తెరకెక్కుతోంది. మనిషి అడువుల్లో తిరిగే జంతువులా మారితే? ఎలా ఉంటుంది;? అన్న డిఫరెంట్ థాట్ తో స్ర్కిప్డ్ ని సిద్దం చేసారు. మెయిన్ లీడ్ లో రణబీర్ కపూర్ ని ఎంపిక చేసారు. ఇక ఇందులో హీరోయిన్ గా ఎంతో మందిలని ఆడిషన్ చేసాక చివరిగా నేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక మందన్నని ఫైనల్ చేసారు.
సందీప్ రాసిన హీరోయిన్ పాత్రకు రష్మిక మాత్రమే న్యాయం చేయగలదని ఏరికోరి మరీ ఆమెని ఎంపిక చేసారు. తాజాగా ఆ పాత్ర వివరాలు లీక్ అయ్యాయి. ఇందులో రష్మిక సైన్స్ స్టూడెంట్ గా కనిపించనుందిట. హీరో పాత్రకి- రష్మిక పాత్రకి సైన్స్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉంటాయని..అదే సమయంలో ఇద్దరి మధ్య కెమిస్ర్టీ కూడా పీక్స్ లోనే ఉంటుందని సమాచారం.
మేల్..ఫీమేల్ మధ్య ఉండే కొన్ని రకాల ఎమోషన్స్ ని సినిమాలో ప్రధానంగా హైలైట్ చేయబోతున్నారుట. ఈ క్రమంలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు 'అర్జున్ రెడ్డి'ని మించే ఉంటాయని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. హీరో పాత్రకి ధీటుగానే హీరోయిన్ రోల్ చాలా ఆసక్తికరంగా సస్పెన్స్ గా ఉంటుందని తెలుస్తోంది.
హ్యూమన్ ఎమోషన్-యానిమల్ ఎమోషన్ మధ్య వ్యత్యాసం చూపే క్రమంలో వచ్చే సన్నివేశాలు హైలైట్ గా ఉంటాయని సమాచారం. మరి ఆ ఎమోషన్..రొమాన్స్ ఏ స్థాయిలో ఉంటుందో కొన్ని నెలలు ఆగితేగానీ తెలియదు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన పనులు శర వేగంగా జరుగుతున్నాయి.
సినిమాకి టాప్ క్లాస్ టెక్సీషియన్స్ పనిచేస్తున్నారుట. మ్యూజికల్ గానూ సినిమా హైలైట్ అవుతుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి సిద్ధార్ధ్ గరిమ మాటలు అందిస్తున్నారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చుతున్నారు. టీసిరీస్ కుమార్- భద్రకాళీ పిక్చర్స్- సినీ స్టూడియోస్ వన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.