విజయ్ తో పెళ్లి పై రష్మిక స్పందన

Update: 2022-02-28 14:30 GMT
రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నా లు గీత గోవిందం మరియు డియర్ కామ్రేడ్‌ సినిమాల్లో కలిసి నటించారు. ఇద్దరు రెండు సినిమాలతో చాలా మంచి స్నేహితులగా మారిపోయారు.

ఇద్దరు కూడా ఒకరి విషయాల గురించి ఒకరు చర్చించుకోవడం మాత్రమే కాకుండా ఒకరి కార్యక్రమాలకు ఒకరు హాజరు అవుతూ ఉంటారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఇంట్లో ఏం స్పెషల్‌ అయినా కూడా తప్పకుండా రష్మిక ఉంటుంది.

కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ముంబయి మరియు బెంగళూరు ల్లో కూడా వీరిద్దరు సందర్బానుసారంగా కలవడం.. పార్టీ లకు మరియు పబ్‌ లకు వెళ్లడం చేస్తూ ఉన్నారు. ఈ కారణాల వల్ల రష్మిక మరియు విజయ్ దేవరకొండ లు ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. గతంలో పలు సార్లు ఇద్దరు కూడా తాము ప్రేమలో లేము అంటూ తేల్చి చెప్పారు. అయినా కూడా మీడియాలో వార్తలు పుట్టుకు వస్తూనే ఉన్నాయి.

విజయ్‌ దేవరకొండ మరియు రష్మిక మందన్నా వివాహం ఇదే ఏడాది అంటూ వచ్చిన వార్తలపై లవ్‌ డ వార్తలు అంటూ విజయ్ దేవరకొండ కాస్త సీరియస్ గానే స్పందించాడు. దాంతో ఆ సమయంలో మళ్లీ వార్తలకు ఫుల్‌ స్టాప్ పడింది. తాజాగా విజయ్ దేవరకొండ తో పెళ్లి పై రష్మిక మందన్నా స్పందిస్తూ మళ్లీ ఒక సారి స్పష్టంగా.. క్లారిటీగా చెప్పేసింది.

రష్మిక మందన్నా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. శర్వానంద్ హీరోగా నటించిన ఆ సినిమా కు కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ సమయంలో ఒక ఇంటర్వ్యూ లో విజయ్ దేవరకొండ తో పెళ్లి విషయమై టాపిక్ వచ్చిన సమయంలో రష్మిక మందన్నా క్లారిటీ ఇచ్చేసింది.

విజయ్ దేవరకొడ నాకు మంచి స్నేహితుడు మాత్రమే. అవన్నీ టైమ్‌ పాస్ అబ్బా.. నాకు పెళ్లికి ఇంకా చాలా సమయం ఉందని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. గీత గోవిందం తర్వాత ఈమె పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి పీఠలు ఎక్కాల్సిన రష్మిక మందన్నా అనూహ్యంగా టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ గా.. ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్ గా ఎదిగిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News