పందిపిల్లతో వర్కవుట్స్

Update: 2018-07-03 10:08 GMT
ఐస్ బకెట్ ఛాలెంజ్ తరహాలో కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ మొదలెట్టిన ఫిట్ నెస్ ఛాలెంజ్ సినీ జీవులను బాగానే ఆకట్టుకుంది. నార్త్ - సౌత్ అనే తేడాలు లేకుండా అన్ని భాషల్లో నామినేట్ అయిన నటీనటులంతా ఫిట్ నెస్ కాపాడుకునే క్రమంలో తమకు ఇష్టమైన ఎక్సర్ సైజులు ఏమిటో చేసి మరీ చూపించి వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఫిట్ నెస్ ఛాలెంజ్ పై యాక్టర్ అండ్ డైరెక్టర్ రవిబాబు డిఫరెంట్ గా రియాక్టయ్యాడు. తాను పెంచుకుంటున్న బంటీతో (పంది పిల్ల) కలిసి వీడియో తీసి షేర్ తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్‌ చేశారు. పందిపిల్లను వీపుపై ఎక్కించుకుని పుల్‌ అప్స్‌ చేశాడు.  ‘‘బంటి ఫిట్‌ నెస్‌ కోసం వ్యాయామం చేయగలుగుతోందని.. మరి మీరు ఎందుకు చేయరంటూ’’ కామెంట్ కూడా పెట్టాడు.

రవిబాబు ఓ పందిపిల్ల ప్రధాన పాత్రలో అదుగో చిత్రాన్ని తీస్తున్నాడు. అప్పుడెప్పుడో మొదలెట్టిన ఈ సినిమా బాగా డిలే అవుతూ వచ్చింది.  గతంలో నోట్ల రద్దు సమయంలో పందిపిల్లతో కలిసి ఏటీఎం క్యూలో నిల్చోని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇదిగో మళ్లీ ఇలా ఫిట్ నెస్ ఛాలెంజ్ తో మరోసారి తన సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించాడు. సురేష్‌ ప్రొడక్షన్స్‌- ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌ బ్యానర్పై ఈ సినిమా వస్తోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    

Similar News