మాస్ మహరాజ్ కి న్యూ ఇయర్ షాక్

Update: 2015-12-31 11:44 GMT
మాస్ మహరాజ్ రవితేజ్ ఓ స్టోరీపై ఇంట్రెస్ట్ చూపించి, కొంత కాలం పాటు చర్చలు జరిపినా.. ఇప్పుడా ప్రాజెక్ట్ చేజారిపోయింది. అక్షయ్ కుమార్, కాజల్ జంటగా నటించిన స్పెషల్ 26పై.. రవితేజ ఇంట్రెస్ట్ చూపించాడు. తెలుగులో రీమేక్ కు దాదాపు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. మాస్ మహరాజ్ ఖాతాలో మరో హిట్ ఖాయం అని అందరూ అనుకుంటున్న టైంలో.. ఓ షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది.

స్పెషల్ 26 సౌత్ రీమేక్ రైట్స్ ను.. దర్శక నిర్మాత మరియు నటుడు త్యాగరాజన్ సొంతం చేసుకున్నాడు. అంతే కాదు.. సౌత్ లోని అన్ని భాషల్లోనూ తన కుమారుడు ప్రశాంత్ హీరోగా నటిస్తాడని ప్రకటించేశాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ రవితేజకు దూరమైందనే విషయం ఖాయమైంది. హిందీలో ఈ చిత్రం హిట్ కావడమే కాకుండా... విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా అక్షయ్ యాక్షన్ కు మంచి మార్కులు పడ్డాయి. అందుకే ఈ మూవీని టాలీవుడ్ లో చేసేందుకు రవితేజ ఆసక్తి చూపించాడు. దీన్ని తెలుగులో హరీష్ శంకర్ డైరెక్షన్ లో రీమేక్ చేయాలన్నది రవితేజ ఆలోచనగా తెలుస్తోంది.

అయితే.. ఇప్పుడు ఏడాది చివర్లో త్యాగరాజన్ నుంచి వచ్చిన ఈ న్యూస్.. రవితేజకు ఓ షాక్ అనే చెప్పాలి. ఓ మంచి ప్రాజెక్ట్ రవితేజ మిస్ అయ్యాడని అంటున్నారు. అయితే.. ఈ చర్చలు సుదీర్ఘంగా సాగుతుండడమే.. ఈ కొత్త డీల్ కు కారణంగా తెలుస్తోంది. దీంతోపాటు.. త్యాగరాజన్ నుంచి నాలుగు భాషలకు ఆఫర్ రావడంతో.. స్పెషల్ 26 మేకర్స్ అటువైపే మొగ్గారంటున్నారు.
Tags:    

Similar News