పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో శంకర్ భాను దర్శకత్వంలో నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఆర్డిఎక్స్ లవ్ ట్రైలర్ ఇందాకా విడుదల చేశారు . కథను స్పష్టంగా రివీల్ చేయనప్పటికీ కీలకమైన పాయింట్ ని మాత్రం చెప్పే ప్రయత్నం చేశారు. అనగనగా ఒక ఊరు. అక్కడో పెద్ద సమస్య . దాని కోసం గ్రామస్తులంతా ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధపడేంత తీవ్రంగా ఉంటుంది. ఈ క్రమంలో వస్తుంది అలివేలు(పాయల్ రాజ్ పుత్).
తన వెనుక ప్రేమ అని పడుతుంటాడు ఓ యువకుడు(తేజుస్ కంచెర్ల). కానీ ఆ గ్రామానికి వచ్చిన సమస్యకు ఈ అమ్మాయి అలివేలుకు ఏదో సంబంధం ఉంటుంది. తాను ఏకంగా పోరాటాలే చేయాల్సి వస్తుంది. దీని వెనుక ఉన్న పద్మవ్యూహాన్ని చేధించదానికి సిద్ధపడుతుంది. ఆ కథే ఆర్డిఎక్స్ లవ్
టీజర్ చాలా బోల్డ్ గా కట్ చేయడం వల్ల తీవ్ర విమర్శలు ఎదురుకున్న యూనిట్ ఈసారి జాగ్రత్త పడింది. లీడ్ పెయిర్ మధ్య రొమాన్స్ ని ఎక్కువ లైట్ చేయకుండా కథలోని కమర్షియల్ అంశాలనే ట్రైలర్ లో పొందుపరిచి మాస్ ని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. పాయల్ సినిమా మొత్తం తన భుజాలపై మోసినట్టు కనిపిస్తోంది.
ఒక పక్క ఫైట్లు మరోపక్క తేజుస్ తో ఘాటు రొమాన్స్ బాలన్స్ చేసి గట్టి పాత్రే పట్టినట్టుంది. సీనియర్ నరేష్ - ఆమని - ఆదిత్య మీనన్ - నాగినీడు ఇలా సపోర్టింగ్ యాక్టర్స్ బాగానే ఉన్నారు. రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం రధాన్ సంగీతం ఎలివేట్ అయ్యాయి. మొత్తానికి ఆర్డిఎక్స్ లవ్ ట్రైలర్ ద్వారా ఇదో ఆల్ ఇన్ వన్ యాక్షన్ ప్యాకేజ్ అనే ఇంప్రెషన్ అయితే కొంత ఇవ్వగలిగారు.
Full View