సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'మహర్షి' ఏప్రిల్ 25 న రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు ఈమధ్య ప్రకటించాడు. మొదట ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేసుకొన్నప్పటికీ షూటింగ్ లో డిలే కారణంగా రిలీజును ఏప్రిల్ చివరి వారానికి మార్చారు. కానీ ఈ వాయిదా చాలామంది మహేష్ బాబు ఫ్యాన్స్ కు నచ్చలేని అంటున్నారు. వారిలో కొందరు బాహాటంగానే తమ అసంతృప్తిని సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు.
ఈ వాయిదా కారణంగా 'మహర్షి' ఉగాది పండగ.. శ్రీరామనవమి శెలవులను కోల్పోవలసి ఉంటుందని ఈ ప్రభావం కలెక్షన్స్ పై పడుతుంది కదా అని వారు వాదిస్తున్నారు. వారు తమ అభిమాన హీరో సినిమా విషయంలో ఆందోళన చెందడం సహజమే.. కానీ నిజానికి అదేమీ పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఆ రెండు శెలవులు మిస్ చేసుకొని వర్కింగ్ డేస్ లో సినిమా రిలీజ్ చేస్తే ఇబ్బందిగానీ ఏకంగా వేసవి శెలవుల్లో విడుదల చేస్తే ఇంకా బెనిఫిట్ కదా? ఏప్రిల్ 5 కు రిలీజ్ చేస్తే అప్పటికి అందరి ఎగ్జామ్స్ పూర్తి అయి ఉండవు. అదే ఏప్రిల్ 25 అంటే స్టూడెంట్స్ అందరికీ సమ్మర్ హాలిడేస్. ఇది ఒకరకంగా 'మహర్షి' కి ప్లస్ అయ్యేదే.
ఇదొక్కటే కాదు.. గత ఏడాది మహేష్ సినిమా 'భరత్ అనే నేను' భారీ కాంపిటీషన్లో రిలీజ్ అయింది. ఒకవైపు 'రంగస్థలం'.. మరోవైపు 'నా పేరు సూర్య' తో పోటీ పడాల్సి వచ్చింది. ఈ సారి సమ్మర్ లో పెద్ద స్టార్ హీరోల సినిమాలు లేవు. దీంతో మహేష్ బాబు సినిమాకు సోలో బ్యాటింగ్. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడం ఖాయం. నెలపాటు 'మహర్షి' బాక్స్ ఆఫీస్ ను దున్నుకోవచ్చు. రొట్టె విరిగి నేతిలో పడిందని అంటారు.. అలా అన్నమాట. అలాంటప్పుడు ఫ్యాన్స్ టెన్షన్ ఎందుకు పడుతున్నారో?