తన దర్శకత్వంలో రాబోయే సినిమా పనిలో బిజీగా ఉంటానని.. అందుకే ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు డేట్లు కేటాయించలేకపోతున్నానని.. ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నానని ఇటీవలే వెల్లడించాడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్. ఐతే నిజంగా రెహమాన్ ఈ కారణంతోనే ‘సైరా’కు నో చెప్పాడా అన్న సందేహాలు కలుగుతున్నాయిప్పుడు. ఎందుకంటే ‘సైరా’కు నో చెప్పిన వేరే సినిమాలకు మాత్రం ఓకే చెబుతున్నాడు. ఓవైపు మణిరత్నం కొత్త సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టాడు. హిందీలో రెండు సినిమాలు చేస్తున్నాడు. మలయాళం - తమిళ భాషల్లో కొత్తగా రెండు సినిమాలకు ఓకే చెప్పాడు.
పృథ్వీరాజ్ హీరోగా మలయాళంలో తెరకెక్కబోయే ‘ఆడుజీవితం’ అనే సినిమాకు ఇటీవలే ఓకే చెప్పాడట రెహమాన్. మరోవైపు తన మేనల్లుడు జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా రాజీవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాకు కూడా రెహమాన్ సంతకం చేశాడు. ప్రకాష్ స్వయంగా సంగీత దర్శకుడైనప్పటికీ.. రెహమానే ఈ చిత్రానికి మ్యూజిక్ చేస్తుండటం విశేషం. నిజానికి ఇది చిన్న స్థాయి సినిమా. దీనికి రెహమానే మ్యూజిక్ చేయాల్సిన అవసరం లేదేమో. ‘సైరా’ లాంటి మెగా ప్రాజెక్టుకు ఆయన అవసరం ఎంతైనా ఉంది. కానీ రెహమాన్ మాత్రం ఈ సినిమా నుంచి బయటికి వచ్చేశాడు. అసలు సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదించాక.. రెహమాన్ తెలుగు దర్శకులెవ్వరితోనూ పని చేయలేదు. రక్షకుడు - నాని - పులి లాంటి సినిమాలకు పని చేసినా.. అవి తమిళ దర్శకులు తీసిన తెలుగు సినిమాలు. తెలుగు డైరెక్టర్లతో తనకు సింక్ కాదని రెహమాన్ భావిస్తాడని.. ‘సైరా’ నుంచి తప్పుకోవడానికి కూడా అదే కారణమని.. కానీ ఆ విషయం చెప్పలేక డేట్లు ఖాళీ లేవని అబద్ధం చెప్పాడని భావిస్తున్నారు టాలీవుడ్ జనాలు.