విడుదల తేదీని ఫిక్స్ చేయడం అనేది ఎంత సంక్లిష్ఠమైన ప్రక్రియో ఇప్పుడు అర్థమవుతోంది. అందునా పాన్ ఇండియా కేటగిరీలో ఒక సినిమాని రిలీజ్ చేయాలంటే అది ఎంతో కష్టమైన ప్రక్రియ. చాలా లెక్కలు వేయాల్సి ఉంటుంది. ఆ రకంగా చూస్తే .. RRR విడుదల తేదీ విషయమై రాజమౌళి అండ్ టీమ్ ఎంతగా తర్జన భర్జన పడ్డారో అర్థం చేసుకోవాలి. ఆరంభం రెండు విడుదల తేదీల ప్రకటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆ రెండు తేదీల్ని కాదని పూర్తిగా కొత్త తేదీని లాక్ చేసారు. మరొకసారి జనవరి 31న అధికారిక ధృవీకరణతో అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఈ ఆకస్మిక మార్పు.. తో కొత్త నిర్ణయం దేనికి? అన్నది విశ్లేషిస్తే షాకిచ్చే నిజాలు తెలిసాయి.
నిజానికి ఏ సినిమాకి అయినా హైప్ ని ప్రజల్లో అలా సుదీర్ఘ కాలం సస్టెయిన్ చేయడం అంత సులువైనది కాదు. ఆర్.ఆర్.ఆర్ ఒక రకంగా లక్కీ అనే చెప్పాలి. ఇప్పటికీ ఈ సినిమాకి పాన్ ఇండియా కేటగిరీలో బోలెడంత హైప్ ఉంది. కానీ దీనిని ఇంకో మూడు నాలుగు నెలలు అలానే ఉంచడం అన్నది అంత సులువేమీ కాదు. అందుకే ఇక మధ్యే మార్గంగా ఒక మంచి రిలీజ్ తేదీని ఎంపిక చేయాలని రాజమౌళి టీమ్ తహతహలాడింది.
తమ సినిమాని రిలీజ్ చేయాలంటే దానికి పోటీగా ఏ సినిమా ఉంది? అన్నది విశ్లేషించిన రాజమౌళికి బచ్చన్ పాండే లాంటి సినిమా హిందీ మార్కెట్లో పోటీగా నిలుస్తోంది. సదరు నిర్మాతలతో రాజమౌళి అండ్ కో మంతనాలు సాగించినా రిలీజ్ తేదీ విషయంలో వాళ్లు తగ్గలేదు. దీంతో జక్కన్న ఆర్.ఆర్.ఆర్ విడుదల తేదీని ముందుకు మార్చుకున్నారు. మార్చి 18న బాలీవుడ్ క్రేజీ చిత్రం బచ్చన్ పాండే రానుంది. దానిని వాయిదా వేయించేందుకు చర్చలు జరిగినా ఫలితంరాలేదు. అలాగే దివంగత పునీత్ రాజ్‌కుమార్ జేమ్స్ మార్చి 17న ఖరారైంది. దీంతో రాజమౌళి ఎంచుకున్న తేదీల్లో ఏప్రిల్ 28 సరైన ప్రత్యామ్నాయ విడుదల తేదీగా కనిపిస్తోంది. కానీ దీనివల్ల చాలా ఆలస్యం అవుతుందని భావించి మార్చి 25 తేదీని లాక్ చేశారు.
ఈలోగానే పలు భారీ చిత్రాలు విడుదలకు రెడీ గా ఉన్నాయి. వీటిలో రాధే శ్యామ్ - భీమ్లా నాయక్- కేజీఎఫ్ 2- లాల్ సింగ్ చద్దా- సూర్య మూవీ. గంగూబాయి కథియావాడి.. ఇలా భారీ చిత్రాలు ఇకపై రిలీజ్ బరిలో ఉన్నాయి. అలాగే ఇతర హిందీ భారీ చిత్రాలతో తెరలనును పంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఏ ఇతర పెద్ద సినిమాతో క్లాష్ కాకుండా తమ సినిమాని వారం పాటు గ్రాండ్ గా ఆడించాలంటే మార్చి 25వ తేదీని బెస్ట్ అని రాజమౌళి టీమ్ భావించి ఉండాలని విశ్లేషిస్తున్నారు.
ఇప్పటికే బోలెడంత ఆర్థిక భారాన్ని ఆర్.ఆర్.ఆర్ నిర్మాతలు పంపిణీ దారులు మోస్తున్నారు. ఇంకా వేచి చూడడం అంత మంచిది కాదని ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ భావిస్తున్నారు. ఆలస్యమయ్యే కొద్దీ ప్రజల్లోనూ అసహనం కూడా ఏమంత మంచిది కాదు గనుక ఇప్పుడే రిలీజ్ చేయాలని భావించారు. ఇక కరోనా క్రైసిస్ వల్ల సగం సీటింగ్ నియమం కూడా వైదొలుగుతుందని రాజమౌళి టీమ్ భావిస్తోంది. ఇక మార్చి 25వ తేదీని ఫైనల్ చేయడం వెనక అంత పెద్ద కసరత్తు సాగించారన్నమాట.