అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ 'పుష్ప'. ఈ సినిమాలో తమిళ నటుడు 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడంటూ ఇంతకముందు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత విజయ్ సేతుపతి డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ సినిమా నుండి తప్పుకున్నాడని న్యూస్ వచ్చింది. దీనికి సంభందించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అందువల్ల ఈ విలన్ క్యారక్టర్ కోసం తమిళ స్టార్ యాక్టర్ బాబీ సింహాని తీసుకోవాలని సుక్కు అండ్ టీమ్ డిసైడ్ అయినట్లు సమాచారం. అయితే ఈ సినిమా నుండి విజయ్ సేతుపతి తప్పుకోడానికి గల కారణాలు మాత్రం తెలిసి రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా విజయ్ సేతుపతి 'పుష్ప' నుండి బయటకి పోవడానికి గల కారణాలు తెలుస్తున్నాయి.
ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్ లో రూపొందుతున్న 'ఉప్పెన' సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. దీంతో 'పుష్ప' సినిమాలో కూడా విలన్ గా నటించడానికి అంగీకరించాడు విజయ్ సేతుపతి. అయితే ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతుంది అన్న ఉద్దేశ్యంతో విలన్ గా నటించడానికి ఒప్పుకున్నాడట. కానీ ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో తెరకెక్కుతుండటంతో విజయ్ సేతుపతి ఆలోచనలో పడ్డాడట. తెలుగు వరకు అయితే ఓకే కానీ ఇతర భాషల్లో కూడా ప్రతినాయకుడిగా అంటే కష్టమని భావించాడట. ఇప్పటికే అక్కడ హీరోగా వరుస సినిమాలను చేస్తున్న విజయ్ సేతుపతి 'పుష్ప' సినిమాతో విలన్ గా తమిళ ప్రేక్షకులకు కనిపిస్తే ఫ్యాన్స్ తో ఇబ్బందులు ఎదురవుతాయని.. మార్కెట్ పరంగా కూడా దెబ్బ తినే అవకాశం ఉందని అనుకున్నాడట.
అంతేకాకుండా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి వున్న శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరిగే స్టోరీ కావడం.. అందులోనూ తమిళనాడుకి చెందిన వ్యక్తులను స్మగ్లర్స్ గా చూపించే అవకాశం ఉండటంతో విజయ్ సేతుపతి 'పుష్ప' నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడట. మరి మరో తమిళ నటుడు బాబీ సింహా ఈ పాత్రలో నటించడానికి ఒప్పుకుంటాడేమో చూడాలి. మొన్ననే 'డిస్కో రాజా'తో తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ నేషనల్ అవార్డు విన్నర్ 'పుష్ప'లో ఆఫర్ వస్తే టాలీవుడ్ లో విలన్ గా పాగా వేసే అవకాశం ఉంది. పాన్ ఇండియా సినిమా కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీ నటులను తీసుకునే పనిలో ఉన్నారు 'పుష్ప' టీమ్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ మరియు ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సుక్కు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.