ఎన్ని ఇంటర్యూలు ఇస్తావ్ రేణు???

Update: 2017-02-28 10:56 GMT
ఆ మధ్యన అందరూ మీరు పవన్ కళ్యాణ్‌ పై ఇంత ప్రేమ కురిపిస్తున్నారు కదా.. తిరిగి ఆయనతో ఒక్కటవ్వచ్చు కదా అంటూ అమాయకమైన ప్రశ్నలు వేస్తే.. వెంటనే ఒక ఇంటర్యూ ఇచ్చేసింది రేణు దేశాయ్. పాపం ఆ ఇంటర్యూలో కన్నీటి పర్యంతమైంది కూడా. అప్పుడే ఆమె మనస్సులో ఉన్న విషయాలన్నీ బయటపెట్టేసింది. ఇప్పుడు మళ్లీ పెడతానంటోంది.

మార్చి 8న ఉమెన్స్ డే సందర్భంగా మరోసారి ఏదో ప్రత్యేకమైన ఇంటర్యూతో మళ్లీ వస్తోంది ఈ అమ్మడు. దాదాపు అన్ని విషయాలూ అప్పుడే మాట్లాడేసింది కాబట్టి ఇందులో కొత్తగా ఏముంటుంది అసలు? అందుకే.. ఎన్ని ఇంటర్యూలు ఇస్తావ్ రేణు అంటూ అందరూ ఆమెను అడుగుతున్నారు. అయితే యుట్యూబ్ లో ఇంటర్యూలతో పాపులర్ అయిన ఒక మీడియా వారు ప్రత్యేకంగా ఆహ్వానించడం వలనే ఈ ఇంటర్యూ ఇస్తోంది తప్పించి.. తను కావాలని ఇంటర్యూ ఏమీ వేయించుకోవట్లేదని తెలుస్తోంది.

సర్లేండి.. అప్పట్లో రేణు దగ్గర నుండి రాని ఆన్సర్లు.. లేదంటే ఆమెపై సంధించని ప్రశ్నలు.. ఇంకేమైనా ఉంటే సందిస్తారేమో. ముఖ్యంగా రేణు దేశాయ్ ఇంటర్యూ అంటే పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ అందరూ కాచుక్కుచ్చున్నారు. అప్పట్లో ఉపాసన ఇంటర్యూకు 1 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు.. ఇప్పుడు రేణు ఇంటర్యూ కూడా అదే క్లబ్బులో చేరుతుందేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News