ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అంటేనే వివాదాలకు మారుపేరులా మారాడు. ఆయనకు కాంట్రవర్సీ అంటే సరదా అని అంటుంటారు కానీ అవేమి పట్టించుకోకుండా తన లైఫ్ తనకు నచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తుంటాడు ఆర్జీవి. ఇటీవలే వర్మ పుట్టినరోజు అంటే చచ్చిన రోజంటూ ఆయన స్టయిల్ లో సమాధానం చెప్పాడు. ఎందుకంటే పుట్టినరోజు అనేది తన జీవితంలో మరో ఏడాదిని క్లోస్ చేసిందని చెప్పుకొచ్చాడు. అవును ఆర్జీవి అంటే అంతే అన్నింట్లోను తనకంటూ ప్రత్యేక మార్క్ సెట్ చేసుకున్నాడు. ముఖ్యంగా కాంట్రవర్సీలను సృష్టించడంలో ఆయనకు ఎవరూ పోటీలేరనే చెప్పాలి.
అయితే నిన్న వర్మ పుట్టినరోజు వేడుకలు మాత్రం ఘనంగానే జరుప్పుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ ఫోటోలు చూస్తే వర్మ ఏ రేంజిలో తన బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్నాడో అర్ధమవుతుంది. ఆ ఫోటోలలో ఆర్జీవి చుట్టూ అమ్మాయిలు చేరి సెల్ఫీలు దిగుతూ హంగామా చేస్తున్నట్లు తెలిసిపోతుంది. కానీ అంతమంది అందమైన అమ్మాయిల మధ్య వర్మ సెలెబ్రేషన్స్ మాములుగా లేవని టాక్. నిజానికి ఆర్జీవిలో అన్ని యాంగిల్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు ఆయన నుండి ఒక్కో యాంగిల్ బయటికి వస్తుంది.
ఓ యాక్టర్, ఓ డాన్సర్, అమ్మాయిలను ఫ్లర్టింగ్ చేసే తెలివి, డైరెక్టర్, ఎప్పటికి ఒకే మనిషిని ప్రేమించే ప్రేమికుడు, అన్నిటికి మించి ఓ కఠోరమైన వాయిస్ గల సింగర్.. ఇన్ని యాంగిల్స్ లోను వర్మ తన మార్క్ సెట్ చేసుకున్నాడు. అయితే తాజాగా అమ్మాయిలతో దిగిన ఫోటోను హాలీవుడ్ యాక్టర్ డాన్ బిల్జెరియన్ తో పోల్చుకొని షాకిచ్చాడు. అలాగే ఫోటో కంపరిసన్ తో పాటుగా.. 'నాకింత వరకు తెలియదు. నాకు డాన్ బిల్జెరియన్ కు సిమిలారిటీస్ ఉన్నాయని.. మా ఇద్దరికి కొన్ని కామన్ థింగ్స్ కలిసాయి' అంటూ కాప్షన్ జోడించాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే ఆర్జీవి బర్త్ డే కలర్ ఫుల్ గానే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆర్జీవి డి-కంపెనీ అనే సినిమాను విడుదలకు రెడీ చేసాడు.