హిందీలో విడుదల చేయాలంటున్న వర్మ!

Update: 2018-12-28 11:34 GMT
రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో  తెరకెక్కిన 'వినయ విధేయ రామ' ట్రైలర్ గురువారం నాడు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.   ట్రైలర్ ఊరమాస్ గా ఉండడంతో సినిమా ఎలా ఉండబోతోందనే విషయంలో ఇప్పటికే ప్రేక్షకులకు ఒక అంచనా వచ్చేసింది. ఇక ఈ సినిమా ట్రైలర్ గురించి దర్శకుడు వర్మ తనదైన.. తనకు మాత్రమే సాధ్యమైన శైలిలో స్పందించాడు.
 
వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా 'వినయ విధేయ రామ' ట్రైలర్ షేర్ చేస్తూ ఇలా ట్వీట్ చేశాడు "బోయపాటి ట్రైలర్ జస్ట్ వా వ్ వ్ వ్ వ్ వ్. ఈ సినిమా డైమండ్స్ తో కలిసిన గోల్డ్(కేజీఎఫ్) కాబట్టి వాళ్ళు హిందీలో విడుదల చేయాలి.  #జంజీర్ బదులుగా ఈ సినిమా హిందీలో రామ్ చరణ్ మొదటి సినిమా అయి ఉంటే బాగుండేదని అనుకుంటున్నాను.. చరణ్ సింపుల్ గా మైండ్ ఫ** బ్లోయింగ్".

గురుడు తిట్టాడా..  పొగిడాడా.. పొగిడినట్టుగా తిట్టాడా.. తిట్టినట్టుగా పొగిడాడా అనేది అర్థం కావాలంటే ఎవరికైనా కాస్త కష్టమే.  భారీగా తెలివితేటలు ఉంటేగానీ ఆ ట్వీట్ల ఆంతర్యం అంతు చిక్కదు.  అందుకే కొంతమంది నెటిజనులు తమ అనుమాలను ఇలా వ్యక్తం చేశారు. ఒకరు "మీరు పొగిడింది నాకు తిట్టినట్టు ఉంటది అది ఏంటో" అని అంటే మరొకరు "పొగిడావా తిట్టావా భయ్యా" అని అడిగారు.  

Tags:    

Similar News