వివాదాస్పద చిత్రాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఆర్జీవి. ఏ వివాదం మొదలైనా.. ఆ వివాదం తనకు తెలిసినా దాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటూ వార్తల్లో నిలవడం వర్మ ప్రత్యేకత. అదే పంథాను తన సినిమాలకు అనుసరిస్తూ వివాదాల్సద లంశాలని తన సినిమాలకు కథా వస్తువులుగా ఎంచుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారాయన. ముందు గ్యాంగ్ స్టర్ చిత్రాలకు కేరాఫ్ గా నిలిచిన ఆయన ఆ తరువాత హారర్ సినిమాల స్పెషలిస్ట్ గా మారారు.
ఇక గత కొంత కాలంగా వివాదాస్పద అంశాలని సినిమాలుగా మలుస్తూ వివాదాలు సృష్టిస్తూ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. ఇక ఈయన సినిమాల నిర్మాణంపై కూడా చయాలా సందేహాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఒకే టైమ్ లో ఐదారు చిత్రాలని ప్రకటించి ఎప్పుడు పూర్తి చేస్తున్నారో తెలియకుండానే వన్ బై వన్ రిలీజ్ కి రెడీ కావడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు స్టార్ డైరెక్టర్ లని కూడా విస్మయానికి గురిచేస్తున్నాయి.
హిట్ , ఫ్లాప్ అనే విషయాలతో సంబంధం లేకుండా గజినీ మొహమ్మద్ దండయాత్రలా వర్మ నుంచి సినిమాలు ప్రేక్షకులపై దండ యాత్ర చేస్తూనే వున్నాయి. అయితే విచిత్రం ఏంటంటే ఈ సినిమాలకి దర్శకులుగా వేరే వారి పేర్లు కనిపిస్తున్నా ఇది `ఆర్జీవీ చిత్రం` అని వర్మ తన కార్డ్ ని వాడుకోవడం చాలా మందికి అర్థం కావడం లేదు. వేరే వ్యక్తి డైరెక్ట్ చేసిన సినిమాని తన సినిమాగా వర్మ ఎందుకు ప్రమోట్ చేసుకుంటున్నాడు?
ఈ నెల 31న విడుదల కానున్న `ఆశ ఎన్ కౌంటర్` చిత్ర ప్రమోషన్స్ లోనూ, పోస్టర్ లోనూ ఆర్జీవీ చిత్రం అని వుంది. ఈ నేపథ్యంలో ఈ పేరుని తాను ఎందుకు పెడుతున్నానన్న విషయంపై మీడియాకు క్లారిటీ ఇచ్చారు ఆర్జీవి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ `ఓ కథ గురించి ఆలోచించి, నాకు ఉన్న అనుభవంతో దాన్ని సినిమాగా ఎలా మలిస్తే బాగుంటుందో ఆలోచిస్తాను. ఆ తరువాత ఆ ప్రాజెక్ట్ ను ఓ దర్శకుడి చేతిలో పెడతా. ఆ సినిమాని ఎవరు తెరకెక్కించినా అందులో నా భాగస్వామ్యం వుంటుంది కాబట్టి `ఆర్జీవీ చిత్రం` అని వేసుకుంటాను` అన్నారు.
అదీ కాకకుండా కొత్త వాళ్ల పేరు కంటే ఆర్జీవీ పేరు ఉంటే సినిమా ప్రమోషన్ కూడా బాగా అవుతుంది. ఇప్పుడు `ఆశ` చిత్రం విఝయానికి వస్తే ఈ కథ విషయమై చాలా మంది పోలీస్ అధికారులతో నేను స్వయంగా మాట్లాడాను. దీనిపై చాలా రీసెర్చ్ చేశాను. నేను కలెక్ట్ చేసిన సమాచారాన్నంతా సినిమా రూపంలో దర్శకుడికి చెప్పి అతనితో తెరకెక్కించాను` అని వర్మ వివరించాడు.
ఇదీ సంగతి. అందుకే వర్మ సినిమాల్లో వర్మ మార్కు కనిపించడం లేదని చాలా మంది అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తను ఇచ్చిన ఆలోచనని ఎవరో ఎగ్జిక్యూట్ చేస్తూ తెరపైకి తీసుకొస్తున్నారు. కానీ అందులో వర్మ మార్కు ఏమాత్రం కనిపించడం లేదు. ఫేలవమైన మేకింగ్, టేకింగ్..దీంతో వర్మ ఇలా నాసిరకం సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యాడేంటని అంతా విషయం తెలియక వర్మని నిందిస్తున్నారని వర్మ తాజా వివరణతో స్పష్టంగా తెలుస్తోంది.