బోల్డ్ బ్యూటీ రంపం కోత‌

Update: 2018-11-14 07:16 GMT
బికినీ వేయాలంటే పెర్ఫెక్ట్ బాడీని మెయింటెయిన్ చేయాలి. ఈ విష‌యంలో కొంద‌రు భామ‌ల గురించి ప్ర‌త్యేకించి చెప్పాలి. బాలీవుడ్ లో దిశా ప‌టానీ - ఇలియానా - దీపిక - బెబో క‌రీనా పెర్ ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్ తో అల‌రించారు. అయితే న‌వ‌త‌రం నాయిక‌ల్లో ఇటీవ‌ల నేహా శ‌ర్మ పేరు ప్ర‌ముఖంగా పాపుల‌రైంది. పెర్ ఫెక్ట్ బికినీ బేబి అంటూ ఫ్యాన్స్ సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా పొగిడేశారు ఈ బ్యూటీని. ఇంకా ఇంకా ఎవ‌రున్నారు అని బికినీకి సూట‌య్యే భామ‌ల‌ను వెతికితే ఇదిగో కాలికి త‌గిలిన తీగ‌లా రియా చ‌క్ర‌వ‌ర్తి త‌గిలింది.

తూనీగ తూనీగ చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ ల‌క్కు చిక్క‌క హిట్టందుకోలేక‌పోయింది. అటుపై బాలీవుడ్ లోనే కెరీర్ ని సాగించింది. అయినా అక్క‌డా అంతంత మాత్ర‌మే. గ‌త ఏడాది జ‌లేబి అనే చిత్రంలో న‌టించింది. ఆ సినిమా ప్ర‌మోషన్స్ వేళ అగ్రెస్సివ్‌ గా సోష‌ల్ మీడియాని యాక్టివేట్ చేసింది. నాటి నుంచి అభిమానుల‌కు నిరంత‌రాయంగా ట‌చ్‌ లో ఉంటోంది. సామాజిక మాధ్య‌మాల్లో వేడెక్కించే బికినీ ఫోటోల‌తో చెల‌రేగిపోతోంది.

లేటెస్టుగా మాల్దీవుల్లో బీచ్ సొగ‌సుల్లో ఈ అమ్మ‌డి వీరంగం మొత్తం ఇన్‌ స్టాగ్ర‌మ్‌ లోకి అప్‌ లోడ్ అయ్యింది. అక్క‌డ రియా చ‌క్ర‌వ‌ర్తి ఫోటోలు యూత్‌ కి సెగ‌లు పుట్టిస్తున్నాయి. ఈ ఫోటోల్ని ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో బోయ్స్ జోరుగా వైర‌ల్ చేస్తున్నారు. బాలీవుడ్ లో సినిమాల‌తో కంటే ఇలాంటి బోల్డ్ కంటెంట్‌ తో - ఎఫైర్ల‌తో ఈ భామ పాపుల‌ర‌వుతోంది. అయితే రియా చేస్తున్న ఈ సంద‌డి చూశాక అయినా అటు బాలీవుడ్ - ఇటు టాలీవుడ్ స్పందిస్తాయేమో చూడాలి. పిలిచి అవ‌కాశం ఇచ్చేవాళ్లు కావాలి అంతే.

Tags:    

Similar News