ఆ రెండు ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇవ్వని రియా

Update: 2020-08-30 14:30 GMT
సుశాంత్‌ మృతి కేసులో సీబీఐ ఎంక్వౌరీ చాలా స్పీడ్‌ గా సాగుతోంది. ఇప్పటికే సుశాంత్‌ సన్నిహితుడిగా పేరున్న సిద్దార్థ్‌ తో పాటు ఇంట్లో పని వారిని రియాను మరియు ఆమె సోదరుడిని కూడా ఎంక్వౌరీ చేస్తున్నారు. శుక్రవారం మరియు శనివారంలో రియా ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. నేడు కూడా ఆమెను ప్రశ్నిస్తున్నారు. నిన్న మొన్న రెండు ప్రశ్నలకు ఆమె సరైన సమాధానం చెప్పలేదు అంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ ప్రశ్నలు పదే పదే అడిగిన సమయంలో ఆమె గట్టిగా అరిచినట్లుగా చెబుతున్నారు.

సీబీఐ వారు రియాను జూన్‌ 8న సుశాంత్‌ ఇంటి నుండి వెళ్లి పోయారు కదా.. అప్పటికి అతడి నుండి బ్రేకప్‌ అయ్యారా.. ఔను సమాధానం అయితే ఎందుకు బ్రేకప్‌ అయ్యారు. మరో ప్రశ్న మీరు సుశాంత్‌ నుండి దూరం వెళ్లి పోయాక మీ ఆరోగ్యం గురించి అతడు మీ సోదరుడికి కాల్ చేసి తెలుసుకునేవాడు. మరి మీరు అలా ఏమైనా చేశారా? అంటూ సీబీఐ వారు ప్రశ్నించారు.

ఈ రెండు ప్రశ్నలను మళ్లీ మళ్లీ అడిగిన సమయంలో ఆమె రకరకాల సమాధానాలు చెప్పడంతో పాటు విసిగిస్తున్నారంటూ ఎంక్వౌరీ ఆఫీసర్‌ పై అరిచినట్లుగా తెలుస్తోంది. నేడు విచారణ పూర్తి అయిన తర్వాత మళ్లీ ఆమెను ప్రశ్నించేది లేనిది రాత్రి వరకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. సుశాంత్‌ విషయంలోనే కాకుండా డ్రగ్స్‌ విషయంలో కూడా ఈమెను ఎంక్వౌరీ చేస్తున్నారు.




Tags:    

Similar News