హిందీ `అల వైకుంఠ‌పుర‌ములో` రిలీజ్ డైలమా?

Update: 2022-01-11 17:30 GMT
టాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `అల వైకుంఠ‌పుర‌ములో` బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. షెహ్ జాదా అనేది టైటిల్. ఈ రీమేక్ లో  కార్తిక్ ఆర్య‌న్.. కృతి స‌న‌న్ జంట‌గా న‌టిస్తున్నారు. రోహిత్ ధావ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భూష‌ణ్ కుమార్-కృష్ణ కుమార్- అల్లు అర‌వింద్-  రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తిచేసి ఈ ఏడాది న‌వంబ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడీ సినిమా రిలీజ్ వివాదంలో ప‌డింది. హిందీ డ‌బ్బింగ్ రైట్స్ ని గోల్డ్ మైన్స్  టెలిఫిల్మ్స్  ద‌క్కించుకుంది. డ‌బ్బింగ్ తో పాటు డిజిట‌ల్ రైట్స్  కూడా ఇదే సంస్థ ద‌క్కించుకుంది.

తాజాగా ఈ సినిమా డ‌బ్బింగ్ రూపంలో రిలీజ్ చేస్తే రీమేక్ ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది స‌స్పెన్స్ గా మారింది. ఈ నేప‌థ్యంలో రీమేక్ వెర్ష‌న్ నిర్మాత‌లు  గోల్డ్ మైన్స్ ఫిల్మ్స్ అధినేత మ‌నీష్ తో ఒప్పందం దిశ‌గా అడుగులు వేసారు. హిందీ వెర్ష‌న్ ప్రీమియ‌ర్  అయితే త‌మ సినిమాపై దెబ్బ ప‌డుతుంద‌ని.. కాబ‌ట్టి ప్రీమియ‌ర్ నిలిపివేయాల్సిందిగా కోరారు. దీనికి మ‌నీష్ ముందుగా ఒప్పుకోలేదు. రైట్స్ త‌న‌వే కాబ‌ట్టి రిలీజ్ చేసుకుంటాన‌ని ప‌ట్టుబ‌ట్టారుట‌. ఈ నేప‌థ్యంలో గుర్ గావ్ 5 స్టార్ హోటల్ లో ఇరువురు మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌లు చివ‌రికి స‌ఫ‌లం అయినట్లు తాజా సమాచారం.

ప్రీమియ‌ర్ ఆప‌డానికి 8 కోట్ల రూపాయ‌లు గోల్డ్ మైన్ టెలి ఫిల్మ్స్ కి  చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్ర‌కారం రీమేక్ వెర్ష‌న్ రిలీజ్ అయిన 16 వారాలు త‌ర్వాత  `అల వైకుంఠ‌పుర‌ములో` హిందీ డ‌బ్బింగ్ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకున్నారు. మొత్తానికి వివాదం ఓ కొలిక్కి వ‌చ్చింది. ఇటీవ‌లి కాలంలో ఇలాంటి వివాదాలు  డ‌బ్బింగ్ నిర్మాత‌ల‌కు ఎన్ క్యాష్ గా మారుతున్నాయి. పెట్టిన పెట్టుబ‌డి క‌న్నా రెట్టింపు ఆదాయం ఈ రూపంలోనే వ‌చ్చేస్తోంది.  
Tags:    

Similar News