మహేష్-బన్నీ.. ఖాళీ చేసేదెవరు?

Update: 2017-10-30 15:53 GMT
ఏప్రిల్ 27 కోసం ముందు కర్చీఫ్ వేసింది మేం.. మెగా ఫ్యామిలీకి ఆ డేటు సెంటిమెంటు కూడా.. కాబట్టి ఆ డేట్ విషయంలో తగ్గేదే లేదు అన్నాడు ‘నా పేరు సూర్య’ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు. మరోవైపు ఈ వ్యాఖ్యలు విన్నాక కూడా ‘భరత్ అను నేను’ టీంలో ఏ మార్పూ కనిపించలేదు. ఈ చిత్ర పీఆర్వో బీఏ రాజు ఏప్రిల్ 27నే మా సినిమా రిలీజ్ అంటూ నొక్కి వక్కాణించారు. దీంతో మహేష్ వెర్సస్ బన్నీ పక్కా అని తేలిపోయింది. దీనిపై హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తుండగానే ‘2.0’ బాంబు వచ్చి పడింది. ఆ చిత్రాన్ని జనవరి 25 నుంచి ఏప్రిల్ 13కు వాయిదా వేశారు. దీంతో మహేష్ - బన్నీ ఇద్దరికీ ఇప్పుడు ఇబ్బంది మొదలైంది.

రెండు వారాలు గ్యాప్ ఉంది కదా అని లైట్ తీసుకునే పరిస్థితి ఎంతమాత్రం లేదు. ‘బాహుబలి’ లాగే ‘2.0’ను కూడా చాలా ప్రత్యేకంగా చూడాల్సిందే. కనీసం మూడు నుంచి నాలుగు వారాలు ఆ సినిమాకు వదిలేయాల్సి ఉంటుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. నెల రోజుల పాటు హవా సాగించే అవకాశముంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక సినిమాను రిలీజ్ చేయడమే కష్టం. ఇక రెండు పెద్ద సినిమాలు ఏప్రిల్ 27న పోటీ పడటమంటే అసాధ్యమనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 27 సేఫ్ డేట్ కాదు. ఇక్కడి నుంచి తప్పుకుని వెనక్కి వెళ్లడమే బెటర్. ఈ పరిస్థితుల్లో ఎవరు ముందుగా డేట్ మార్చుకుని మేలో బెర్తు బుక్ చేసుకుంటారో వాళ్ల పరిస్థితే మెరుగు. నిన్నటి దాకా ఏప్రిల్ 27 విషయంలో పట్టుదలగా ఉన్న రెండు సినిమాల వాళ్లు.. ఇప్పుడు మాకొద్దంటూ ఆ డేటును వదిలేసి వేరే డేట్ కోసం త్వరపడే అవకాశాలున్నాయి. మరి ఎవరు ముందుగా ఆ పని చేస్తారో చూద్దాం.

Tags:    

Similar News