2.0: అనుకున్నట్టే జరిగింది!

Update: 2018-11-22 07:58 GMT
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సై-ఫై ఫిలిం '2.0' నవంబర్ 29 న విడుదలకు సిద్దం అవుతోంది.  రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కడం.. రజనీకాంత్- అక్షయ్ కుమార్ లాంటి భారీ స్టార్లు ఉండడంతో ఈ సినిమా 'బాహుబలి-2' రికార్డులను సవరిస్తుందని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి.  ఆమీర్ ఖాన్ 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' విషయంలో ఇలాంటి అంచనాలే వ్యక్తం అయినా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడింది. మొదటి రోజు కలెక్షన్స్ రికార్డు విషయంలో 'బాహుబలి'ని 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' అధిగమించింది.  

ఇప్పుడు '2.0' రిలీజుకు వారం మాత్రమే ఉండడంతో '2.0' నెలకొల్పబోయే రికార్డులపై చర్చ సాగుతోంది.  మొదటి రోజు రిలీజ్ కానున్న సంఖ్య విషయంలో 'బాహుబలి-2' రికార్డును '2.0' అధిగమించనుందని ఇప్పటికే తరణ్ ఆదర్శ్ కు చెందిన బాలీవుడ్ హంగామా సైట్ లో కథనం ప్రచురించారు.  'బాహుబలి: ది కంక్లూజన్' దేశవ్యాప్తంగా 6500 థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పుడు '2.0' అంతకంటే వంద ఎక్కువగా 6600 థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సంఖ్య 6800 వరకూ టచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.   

నార్త్ ఇండియా: 4000 to 4100
ఏపీ/తెలంగాణా: 1200 - 1250
తమిళ నాడు: 600-625
కేరళ: 500-525
కర్ణాటక: 300

ఇక అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే ఈ సినిమాకు రూ.120 కోట్లు వస్తాయని ఇప్పటివరకూ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రీమియర్స్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చిట్టి రోబో విధ్వంసం ఓ రేంజ్ లో ఉండబోతుందట. మరి థగ్స్ లా మొదటి రోజు హడావుడేనా లేదా బాహుబలి లా థియేటర్లలో పాతుకుని పోయి ఓ నెల రోజలు దుమ్ము దులుపుతుందా అనేది వేచి చూడాలి.
Tags:    

Similar News