బాహుబలికి పోటీగా 15 బాషల్లో..

Update: 2017-05-31 05:38 GMT
2017లో సినిమా ఇండస్ట్రిలో ఒక మహా అద్భుతం జరిగింది. అదే జక్కన్న తీసిన బాహుబలి2. ఈ సినిమా కొట్టిన రికార్డులు, బాక్స్ ఆఫీసు కలెక్షన్లు గురించి ఇప్పటికే మనకు తెలుసు. బాహుబలి గీసిన గీత దాటాలి అంటే అది మళ్ళీ అంతటి మహా మేకర్లు కలిస్తేనే జరుగుతుంది. ఇప్పుడు కూడా అలాంటిదే జరగబోతోంది. అదేంటి అనుకుంటున్నారా.. అదే సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘2.0’. ఈ సినిమా ఇప్పుడు బాహుబలి గీసిన గీతను దాటి ముందుకు వెళ్లడానికి అన్నీ సన్నాహాలు చేస్తోంది.

శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో కు ఇది సిక్వెల్. ఈ సినిమాను సుమారుగా 450 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బాహుబలి2 ఇచ్చిన బూస్ట్ అప్ తో 2.0 ని సుమారుగా 15 భాషలలొ డబ్బింగ్ చేస్తున్నారు. బాహుబలి2 తో యురోప్ లో కూడా మంచి మార్కెట్ సంపాదించింది ఇండియన్ సినిమా. జపాన్, చైనా లో కూడా డబ్ చేసి అక్కడ రికార్డు కలెక్షన్లు నమోదు చేసింది. అలాగే అమీర్ ఖాన్ దంగల్ సినిమా కూడా చైనా లో మంచి విజయం అందుకుంది. కానీ శంకర్ కు రజిని సత్తా తెలుసు కనుక తమిళ్ - తెలుగు - హింది - మలయాళం - ఇంగ్లిష్ భాషలతో పాటుగా జపాన్ - చైనా లో కూడా డబ్బింగ్ చెప్పి విడుదల చెయ్యడానికి సిద్దపడుతున్నారు. జపాన్ లో రజినీకాంత్ సినిమాకు  ఏ ఇండియన్ స్టార్ కు లేనంత మార్కెట్ ఉంది. మలేసియాలో కూడా అంతే. కాబట్టి 2.0 కు పెద్ద స్థాయిలోనే వర్కవుట్ కావచ్చు.

ఈ డబ్బింగ్ పనులు వలన 2017 దీపావళికి విడుదల కావలిసిన సినిమా 2018 జనవరికి మార్చారు. 2.0 అనే  సైన్స్ ఫిక్సెన్ సినిమాలో రజినీకాంత్ తో పాటుగా మరో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా నటిస్తున్నారు. శంకర్ డైరెక్టర్ గా ఏ ఆర్ రహ్మాన్ సంగీత దర్శకుడుగా 2018 వ ఏట ఇండియా లోనే అతి పెద్ద సినిమాగా విడుదల అవుతుంది. రికార్డులు గురించి అప్పుడే ఎందుకు కానీ రిలీజ్ తరువాత చూద్దాంలే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News