'ఆర్‌ ఆర్‌ ఆర్‌' ఆ స్థాయిలో హిట్‌ కొట్టేనా?

Update: 2020-05-29 06:15 GMT
టాలీవుడ్‌ లోనే కాకుండా ఇండియన్‌ సినీ చరిత్రలోనే బాహుబలి తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది. దాదాపుగా రెండు వేల కోట్ల వసూళ్లను రాబట్టిన బాహుబలి 2 చిత్రంను ఇప్పట్లో ఏ సినిమా క్రాస్‌ చేసే అవకాశం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చే సినిమాలు అన్ని కూడా నాన్‌ బాహుబలి రికార్డు అంటూ రికార్డు నమోదు చేయాల్సిందే తప్ప బాహుబలి 2 రికార్డును బ్రేక్‌ చేయడం మాత్రం సాధ్యం కాదంటున్నారు. కాని ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం మాత్రం బాహుబలి 2 రికార్డును బ్రేక్‌ చేస్తుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

బాహుబలి 2 చిత్రం రికార్డును ఆర్‌ఆర్‌ఆర్‌ బ్రేక్‌ చేయడం అంటే అంత సులభమైన విషయం అస్సలు కాదు. ప్రభాస్‌ కు ఉన్న క్రేజ్‌ మరియు పలు విషయాలు ఆ సినిమాకు కలిసి వచ్చింది. కాని ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్న హీరోలు చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ లకు సౌత్‌ లోనే పూర్తి స్థాయి లో గుర్తింపు లేదు. అలాంటిది బాలీవుడ్‌ లో ఈ ఇద్దరు హీరోలు భారీ వసూళ్లను నమోదు చేయడం అంటే అద్బుతమే అంటున్నారు.

రాబోయే కాలంలో నాన్‌ బాహుబలి రికార్డు మాదిరిగా నాన్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డు అంటూ కొత్తగా వస్తుందా అంటే అనుమానమే అంటున్నారు. సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌ లో విడుదల అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ సినిమా క్రేజ్‌ ను పెంచి కనీసం వెయ్యి కోట్లు అయినా రాబడితే నాన్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డులు ప్రారంభం అవుతాయి. కాని ఆర్‌ఆర్‌ఆర్‌ కు అంతటి సత్తా ఉందా అంటూ సినీ విశ్లేషకులు గట్టిగా ఔను అని మాత్రం సమాధానం చెప్పలేక పోతున్నారు.
Tags:    

Similar News