RRR: ఇంటర్వెల్ లో చిరుతతో ఎన్టీఆర్ ఫైట్ ని ఇలా క్రియేట్ చేశారు..!

Update: 2022-07-13 06:30 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా "RRR". పాన్ ఇండియా సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

బలమైన కథతో ఎమోషన్స్ - యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించే రాజమౌళి.. వాటికి విజువల్ ఎఫెక్స్ట్ జతచేసి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంటారు. 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలోనూ గ్రాఫిక్స్ కు పెద్ద పీట వేశారు.

ముఖ్యంగా చరణ్ - తారక్ ఇంట్రడక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ క్లైమాక్స్ సన్నివేశాలలో వీఎఫ్ఎక్స్ వర్క్స్ అబ్బురపరిచాయి. ఇప్పటికే కొన్ని సీన్స్ సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఎలా జరిగిందో చిత్ర బృందం చూపించింది.

ఈ క్రమంలో లేటెస్టుగా ట్రిపుల్ ఆర్ ఇంటర్వెల్ లో ఎన్టీఆర్ జంతువులతో పోరాడే సన్నివేశాన్ని ఎలా షూట్ చేశారో తెలియజేసే వీడియో బయటకు వచ్చింది. ఇందులో తారక్ తన మీదకు చిరుత దాడి చేయడానికి వస్తుందని ఊహించుకొని నటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

మకుట విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ ఈ యాక్షన్ సన్నివేశానికి అద్భుతమైన వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ జోడించి మరింత ఆసక్తికరంగా రోమాలు నిక్కబొడుచుకునేలా తీర్చిదిద్దింది. ఈ విజువల్ మేకింగ్ వీడియోను చూస్తే ఎవరైనా అవాక్కాల్సిందే. జంతువు లేకుండా ఉన్నట్లు అనుకొని ఎస్ప్రెషన్స్ ఇచ్చిన ఎన్టీఆర్ ను మెచ్చుకొని తీరాల్సిందే.

కాగా, 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతమైన నటన కనబరిచారు. తమ డ్యాన్స్ లతో అందరినీ ఉర్రూతలూగించారు. అలియా భట్ - అజయ్ దేవగన్ - సముద్రఖని - ఒలివియా మోరిస్ - శ్రియా శరణ్ -రాహుల్ రామకృష్ణ ఇతరులు ఇతర పాత్రలు పోషించారు.

డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత దానయ్య భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు.

RRR మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించింది. థియేటర్లలో దుమ్మురేపిన ఈ క్రేజీ మల్టీస్టారర్.. 50 రోజుల తర్వాత ఓటీటీ వేదికల మీదకు వచ్చి అక్కడా హవా కొనసాగిస్తోంది.

'ఆర్.ఆర్.ఆర్' తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్షన్స్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటే.. హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయబడింది. ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత ఇప్పుడు ఈ సినిమా గ్లోబల్ రీచ్ అందుకుంది. అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది.

https://youtube.com/shorts/zZH1GZBHgUs?feature=share
Tags:    

Similar News