రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ విడుదల అయ్యి 50 రోజులు పూర్తి అయ్యింది. కరోనా వల్ల దాదాపు రెండు సంవత్సరాల పాటు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎట్టకేలకు విడుదల అవ్వడం... రాజమౌళి సినిమా అవ్వడంతో వందల కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం.. వేయ్యి కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకోవడం చకచక జరిగి పోయింది.
ఆర్ ఆర్ ఆర్ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందగా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు హీరోలుగా నటించారు. సినిమా విడుదల అయ్యి అప్పుడే 50 రోజులు పూర్తి అయ్యింది. అయినా కూడా సందడి కంటిన్యూ అవుతూనే ఉంది.
ఈమద్య కాలంలో సినిమాలు రెండు మూడు వారాల కంటే ఎక్కువగా థియేటర్లలో కనిపించడం లేదు. నాలుగు వారాలు అయితే కనీసం మీడియాలో కూడా కనిపించడం లేదు. అలాంటిది రెండు నెలలు కావస్తున్నాకూడా ఇంకా జనాల్లో ఆర్ ఆర్ ఆర్ చర్చ జరుగుతోంది.
ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకునేప్పటికి రూ.1110.9 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. తెలుగు సినిమాల్లో నెం.2 గా ఈ సినిమా నిలిచింది. బాహుబలి తర్వాత స్థానం ను దక్కించుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్ విషయానికి వస్తే నెం.3 గా నిలిచింది. వరల్డ్ బాక్సాఫీస్ విషయానికి వస్తే నెం.4 గా ఈ సినిమా నిలిచింది.
మొత్తానికి రికార్డు బ్రేకింగ్ వసూళ్లు దక్కించుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా తో రాజమౌళి మరోసారి తన స్థాయిని పాన్ ఇండియా స్థాయిలో నిరూపించాడు. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు కూడా ఈ సినిమా తో పాన్ ఇండియా స్టార్స్ గా నిలిచారు అనడంలో సందేహం లేదు. అద్బుతమైన వసూళ్లను దక్కించుకున్న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం దేశ వ్యాప్తంగా వందకు పైగా సెంటర్ల లో సినిమా ఆడుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని యూనిట్ సభ్యులు అధికారికంగా వెళ్లడించలేదు కాని ఇంకా ఆడుతూనే ఉందంటున్నారు. కేజీఎఫ్ 2 కాస్త ఆలస్యం అయ్యి ఉంటే ఆర్ ఆర్ ఆర్ సినిమా 1500 కోట్ల రూపాయల మార్క్ ను క్రాస్ చేసేది అనేది ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం.