రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సూపర్ హిట్ టాక్ దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమా వసూళ్ల విషయంలో అక్కడ ఎక్కువ.. ఇక్కడ తక్కువ అన్నట్లుగా కాకుండా ప్రతి చోట కూడా కుమ్మేస్తోంది. గత రికార్డులను ఎన్టీఆర్ చెప్పినట్లుగా తొక్కుకుంటూ పోతుంది.. రామ్ చరణ్ చెప్పినట్లుగా కుంభస్థలం కొట్టినట్లుగా రికార్డుల వర్షం కురుస్తుంది.
అమెరికాలో ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ సాధించని వసూళ్లను ఈ సినిమా సాధించడం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. నార్త్ ఇండియాలో ఈ సినిమా కుమ్మేస్తోంది. ఇక ఆఫ్రికన్ దేశాల్లో కూడా ఈ సినిమా రాబడుతున్న వసూళ్లు ఆశ్చర్యంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా.. దుబాయి ఇలా ప్రతి దేశంలో కూడా అక్కడి గత రికార్డులను బ్రేక్ చేస్తూనే ఈ సినిమా దూసుకు వెళ్తోంది.
నేపాల్ లో కూడా ఈ సినిమా ఓ రేంజ్ లో దూసుకు పోతుంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా సాధించని వసూళ్లను.. ఆ మాటకు వస్తే అక్కడి సినిమాలు కూడా సాధించని వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంటుందట. ఏకంగా నేపాలీ కరెన్సీ లో 7 కోట్ల రూపాయలను అక్కడ ఆర్ ఆర్ ఆర్ రాబట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రతి ఒక్క సన్నివేశానికి కూడా అక్కడి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.
నేపాల్ లో సినిమా ను జనాలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనే విషయాన్ని ఇటీవల సోషల్ మీడియాలో షేర్ అయిన కొన్ని విడియో లు చెప్పకనే చెబుతున్నాయి. స్క్రీన్ ముందుకు వెళ్లి డాన్స్ లు చేయడం.. థియేటర్ల వద్ద హడావుడి చేయడం జరుగుతుంది. ఇలా ఒక ఇండియన్ సినిమాకు ఆ దేశంలో జరగడం ఇదే ప్రథమం అంటూ అక్కడి మీడియా వారు చెప్పుకొచ్చారు.
రాజమౌళి ఏం చేసినా లార్జన్ దెన్ లైఫ్ అన్నట్లుగా చేస్తాడు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు వసూళ్లు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ సినిమాకు సాధ్యం కాని వసూళ్లను పలు దేశాల్లో నమోదు చేస్తున్నాయి.
బాహుబలి 2 కి కాస్త దూరంలో ఈ సినిమా ఆగిపోతుందేమో కాని.. ఖచ్చితంగా ఇదో సంచలన మూవీ అంటూ జక్కన్న అభిమానులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారట.